(Image source from: Catherine tress to romance with manchu vishnu in yerra bassu movie)
దర్శకరత్న దాసరి నారాయణరావు, మంచు విష్ణుతో కలిసి తన స్వీయ దర్శకత్వంలో 151 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే! కోలీవుడ్ లో హిట్టయిన ‘‘మంజ పై’’ సినిమాను టాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఇందులో దాసరి తాతగా, విష్ణు మనవడుగా కనిపించబోతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి వార్తలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు ‘‘ఎర్రబస్సు’’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా జూలై 24వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం కొన్నాళ్లవరకు వేట చేసిన అనంతరం... చివరికి కేథరిన్ ట్రెసాకు సంప్రదించారని... అందుకు ఆమె ఓకే కూడా చేసేసిందని సమాచారం! దీంతో ఈ అమ్మడు అటు తాత ఇటు మనవడు మధ్య ఎర్రబస్సులో నలిగిపోనుందని ఇండస్ట్రీలో పలురకాలుగా చెప్పుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.
కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సంగీతం అందిస్తున్నట్టు సమాచారం! అన్నీ సవ్యంగా జరిగితే... వచ్చే ఏడాది సంక్రంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్ లో దర్శకనిర్మాతలు వున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి విశేషాలు త్వరలోనే అధికారికంగా విడుదల చేస్తామని యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more