Sunny leone craze in tollywood and kollywood film industry

Sunny Leone craze in Tollywood and kollywood film industry, sunny leone latest news, sunny leone hot news, sunny leone in tollywood movie, sunny leone craze in south film inustry, sunny leone latest hot photo shoot, sunny leone movies in bollywood, sunny leone hot scenes, porn star sunny leone news

Sunny Leone craze in Tollywood and kollywood film industry

సన్నీతో చేస్తే వచ్చే ఆ కిక్కేవేరబ్బా!

Posted: 07/15/2014 10:27 AM IST
Sunny leone craze in tollywood and kollywood film industry

మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ హాట్ హీరోయిన్ సన్నీలియోన్ ఈమధ్య వార్తల్లో నలిగిపోతోంది. గతంలో పోర్న్ సినిమాలలో వున్నందంతా చూయించేసి, బాలీవుడ్ లో ఎంట్రీ అయిన ఈ సెక్సీ భామ... బాలీవుడ్ ఇండస్ట్రీలో వున్న దర్శకనిర్మాతల నుంచి అభిమానుల వరకు అందరినీ నిద్రలేకుండా చేస్తోంది. ఈమెతో సినిమాలు ఎప్పుడెప్పుడు చేద్దామా అని దర్శకనిర్మాతలు క్యూలు కడుతుంటే... సన్నీలియోన్ సినిమా థియేటర్లకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారట! మొన్నటివరకు స్టార్ హీరోయిన్లుగా బాలీవుడ్ లో చెలామణీ అయిన తారలు... ఈ అమ్మడు ఎంట్రీ కాగానే వారికి ముచ్చెమటలు పట్టిస్తోందని అందరూ చర్చించుకుంటున్నారు.

ఇప్పుడు తాజాగా ఈమె హవా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా పాకిపోయింది. ‘‘కుల్ఫీ’’ సినిమాలో ఐటం సాంగ్ చేసిన ఈ హాట్ భామ.. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకాభిమానులకు చేరువయ్యింది. గతంలో పోర్న్ సినిమాల్లో నటించిన అనుభవంతో అందరినీ తమ బుట్టలో పడేస్తుంది. ఇప్పటికీ కూడా ఈ అమ్మడు పొట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని, హాట్ హాట్ సన్నివేశాలలో నటించి రక్తికట్టిస్తోంది. ఐటం సాంగులలో చిందులు వేస్తూ ఒక కొత్త అనుభూతిని పంచి పెడుతోంది. దీంతో ఈమె ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం... సౌత్ ఇండస్ట్రీలో వున్న ప్రేక్షకజనాలతో సహా దర్శకనిర్మాతలు కూడా ఈమె అందాలను చూసేందుకు పిచ్చెక్కిపోతున్నారని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం సన్నీలియోన్ మంచి విష్ణు హీరోగా నటిస్తున్న ‘‘కరెంటు తీగ’’ సినిమాలో ఒక టీచర్ పాత్రలో నటిస్తోంది. అందులో కూడా సన్నీలియోన్ హాట్ గా కనిపిస్తోందని, ఆమె నటించిన సన్నివేశాలు ప్రేక్షకజనాలను కిక్కెక్కిస్తాయని యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు. దీంతో టాలీవుడ్ లో వున్న యువజనాలు ఈ సినిమాకోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇదే విషయాన్ని గమనించిన మన టాలీవుడ్ దర్శకనిర్మాతలు... ఇప్పుడు సన్నీలియోన్ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తమ సినిమాల్లో సన్నీని కొన్ని హాట్ సన్నివేశాల్లో నటించేందుకు తీసుకుంటే... వాటిని చూడడానికైనా జనాలు థియేటర్లకు పరిగెత్తుకుంటూ వస్తారని దర్శకనిర్మాతలు చర్చలు మొదలుపెట్టారని సమాచారం!

సన్నీలియోన్ కు వున్న క్రేజ్ ను క్యాచ్ చేసుకుని, తమ సినిమాల్లో ఐటం సాంగ్ కు గానీ లేదా కుదిరితే రెండు, మూడు హాట్ సన్నివేశాల్లో నటింపజేయాలని ప్లాన్ వేసుకుంటున్నారు మన టాలీవుడ్ దర్శకనిర్మాతలు. ఆమె నటించడం ఒక పెద్ద బోనస్ అవుతుందని, కలెక్షన్ల వర్షం కురుస్తుందని చెప్పుకుంటున్నట్టు సమాచారం! ఈ లెక్కప్రకారం చూస్తుంటే.. సన్నీలియోన్ కు ఇక సౌత్ ఇండస్ట్రీలో కూడా తన హవాను చాటుకుంటూ... లాంగ్ కెరీర్ ను కొనసాగిస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు. నిజమే... సన్నీతో సినిమాలు చేయడం అసలు కిక్కేవేరబ్బా!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles