Sri divya salary increased to 50 lakhs

Sri Divya Salary increased to 50 Lakhs, Sri Divya increases her remuneration, Sridivya's sudden raise in her salary, Sridivya hikes her fee to 50 lakhs, Telugu Girl Sri Divya demands Rs 50 lakhs, Actress Sri Divya has increased her salary, Sri Divya Remuneration

Sri Divya Salary increased to 50 Lakhs

ఏంటీ... ఇలా పెంచేసింది

Posted: 07/09/2014 11:45 AM IST
Sri divya salary increased to 50 lakhs

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే అనే సామెత ఈమధ్య ఓ కుర్రపిల్లకు గుర్తొచ్చినట్లుంది. దీంతో ఏకంగా తన రేటును మూడింతలు పెంచేసింది. బస్ స్టాప్ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీదివ్యకు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు సరిగ్గా రావడం లేదు. తీంతో టాలీవుడ్ ను వదిలేసి కోలీవుడ్ కు చెక్కేసింది. కోలీవుడ్ లో ప్రస్తుతం చిన్న హీరోయిన్లకు చుక్కలు చూపిస్తుంది శ్రీదివ్య.

కోలీవుడ్ లో ఈ అమ్మడు నటించిన చిత్రాలు వరుసగా ఘనవిజయం సాధిస్తుండటంతో వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఏడు సినిమాలున్నాయి. దీంతో టాప్ హీరోయిన్ అయిపోయాననే ఆలోచనతో ఈ అమ్మడు తన రేటును బాగా పెంచేసిందట. ఒక సినిమాకు 15 లక్షల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకునే ఈ అమ్మడు తన రేటును మూడింతలు పెంచేసింది. అంటే 50 లక్షలు ఇస్తేనే సినిమా చేస్తానంటూ చెబుతుందట. ఇటీవలే ఈ అమ్మడికి కోలీవుడ్ హీరో కార్తి సినిమాలో హీరోయిన్ నటించే అవకాశం ఇవ్వడానికి ఈ అమ్మడిని ఆ చిత్ర నిర్మాతలు సంప్రదించారట.

దీంతో పెద్ద సినిమా, చిన్న సినిమా అని చూడకుండా వెంటనే తన రెమ్యునరేషన్ ను 50 లక్షలకు పెంచేసిందట. 50 ఇస్తేనే చేస్తానంటూ ఆ నిర్మాతలకు చెప్పుకొచ్చిందట. దీంతో ఈ అమ్మడికి అంత సీన్ లేదన్నట్లుగా ఆ నిర్మాతలు అక్కడి నుంచి వెళ్లిపోయారట. చిన్న సినిమాల్లో నటించగానే మరీ స్టార్ హీరోయిన్ లా ఫీలైపోతుంది. ఇలా అయితే కష్టమేనంటూ కోలీవుడ్ వర్గాలు ఈ అమ్మడిపై కామెంట్లు చేస్తున్నాయి. మరి త్వరలో ఈ అమ్మడు తన రేటును తగ్గిస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh