టాలీవుడ్ సినీ పరిశ్రమ విడిపోవాలని చాలా మంది కొద్దిరోజుల నుంచి మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా టాలీవుడ్ సినిమా పరిశ్రమ మొత్తం కేవలం నాలుగు కుటుంబాల ఆధీనంలో మాత్రమే ఉన్నాయంటూ కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే ఈ వార్తలపై నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు గతకొద్ది రోజులుగా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే తాజాగా ఈ వార్తలన్నింటి గురించి నిర్మాత సురేష్ బాబు తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
‘చిత్ర పరిశ్రమ హైదరాబాద్ ను వీడుతుందా అని అందరూ అడుగుతున్నారు. ఎక్కడ రాయితీలు, సబ్సిడీలు ఇస్తే అక్కడకు పరిశ్రమ వెళ్లి తీరుతుంది. అది విశాఖపట్నమా లేక విజయవాడా అనేది మరో ఐదేళ్లలో తేలిపోతుంది. ఛాంబర్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. చెన్నై నుంచి వచ్చి చిత్రీకరణలు ప్రారంభించినప్పుడు ఇక్కడ ఛాంబర్ లేదు. ఛాంబర్ అనేది కేవలం ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్య వారధి మాత్రమే. ప్రధాన కేంద్రంలో ఛాంబర్ ఉంచి.. మనకు అనువైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరపొచ్చు. అది ఆదిలాబాద్ కావొచ్చు.... రాజమండ్రి కావచ్చు’ అని తెలిపారు.
అంతే కాకుండా... ‘టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఏం జరిగినా కూడా ‘ఆ నాలుగు కుటుంబాలు’ అని అంటుంటారు. మేమేమి పరిశ్రమలో అన్యాయంగా డబ్బులు సంపాదించుకోలేదు. ఎక్కడో డబ్బులు తీసుకోని స్టూడియోలు కట్టుకోలేదు. మా పెద్దలు సినిమాలు తీసి సంపాదించిన డబ్బుతో స్టూడియోలు, పంపిణీ సంస్థలు ఏర్పాటు చేసుకున్నాం. థియేటర్ల సమస్య దేశవ్యాప్తంగా ఉంది. పెద్ద కంపెనీలు థియేటర్లను లీజుకు తీసుకొంటున్నాయి. ఆయా థియేటర్ల యాజమాన్యాలు కూడా అందుకు అంగీకరిస్తున్నాయి. దీంతో ఆ యాజమాన్యానికి నచ్చిన డబ్బులొస్తాయనుకునే సినిమానే ఆడిస్తారు’ అని చెప్పుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more