Shah rukh khan showers blessings to deeksha seth

Deeksha Seth Sharekhan, Sharekhan offers Deeksha Seth, Bollywood Movie News, Hindi Gossips, Latest Bollywood Film News, Latest Bollywood Gossips

For Deeksha Seth performance in Lekar Hum Deewana Dil Hindi movie Sharekhan offers a change in his upcoming movie. For Latest Bollywood News and Hindi Gossips click on www.teluguwishesh.com

ఖాన్ కన్ను దీక్షా పై పడింది.. సుడి తిరిగినట్లే

Posted: 07/05/2014 02:37 PM IST
Shah rukh khan showers blessings to deeksha seth

టాలీవుడ్ ఇండస్ట్రీకి ‘వేదం ’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన డిల్లీ పొడుగుకాళ్ళ సుందరి దీక్షాసేత్ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. తెలుగులో అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండటంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బాలీవుడ్ వెళ్ళింది. అక్కడ ‘లేకర్‌ హమ్‌ దివానీ దిల్‌ ’ అనే సినిమాలో అర్మాన్‌ జైన్‌ కి జంటగా నటించింది.

ఈ సినిమా నిన్న తాజాగా ప్రేక్షకులt ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రీమియర్ షోకి బాలీవుడ్ స్టార్లు  అలనాటి అందాల తార రేఖ, షారుక్‌ఖాన్‌ వచ్చి తిలకించి దీక్షాసేత్ పై ప్రశంసల జల్లు కురించారు. ఈ జల్లుల్లో తడిసి ముద్దయిన దీక్షాసేత్ ఈ సినిమా ప్రమోషన్ కోసం పడిన కష్టాన్ని అంతా మరచిపోయానంటు సంబరపడుతుంది.

కారణం బాలీవుడ్ బాద్ షా దీక్షాని దగ్గరకు తీసుకొని  యాక్టింగ్ బాగా చేశావంటూ కితాబు ఇచ్చాడు. కష్టపడుతున్నందుకు తగ్గ ఫలితం దక్కుతుందని, ఫ్యూచర్‌లో సక్సెస్ అవుతావంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. తొలి సినిమా టాక్‌ బయటకు రాకముందే ఈ సినిమాపై నెలకొన్న అంచనాల నేపథ్యంలో, దీక్షా సేథ్‌కి బాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట. షారుక్‌ కూడా తన తదుపరి సినిమాలో ఏదో ఒక ఛాన్సిస్తానని చెప్పినట్లు దీక్షా తన సన్నిహితులతో చెప్పుకుంటూ ఫుల్ హ్యాపీగా ఫీలవుతుందట.

మరి బాద్ షా చెయ్యి పడింది కాబట్టి అమ్మడు కెరియర్ గాడిలో పడినట్లే అంటున్నారు సినిమా జనాలు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles