Pawan kalyan use hyosung gv 650 bike

Pawan Kalyan Use Hyosung GV 650 Bike, Pawan Kalyan new bike, Oh My God remake, Gopala Gopala movie shooting, Pawan Kalyan bike for Gopala Gopala

Pawan Kalyan bike is used for the same scene in Gopala Gopala. His bike is Hyosung GV 650 Aquila Pro which costed him Rs 6.6 lakh.

బాలయ్య ట్రెండ్ ను ఫాలో అవుతున్న పవన్ ?

Posted: 06/21/2014 04:52 PM IST
Pawan kalyan use hyosung gv 650 bike

ఒరేయ్ ‘‘ఈ గబ్బర్ సింగ్ ట్రెండ్ ఫాలో అవ్వడ్రోయ్..... ట్రెండ్ సెట్ చేస్తాడు ’’ అనే డైలాగ్ కొట్టిన పవన్ కళ్యాణ్ బాలయ్య ట్రెండ్ ను ఫాలో అవ్వడం ఏంటని ఆశ్చర్యపోకండి. హిందీలో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్ ’ చిత్రాన్ని తెలుగులో ‘గోపాలా గోపాలా' ’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

హిందీ వెర్షన్లో అక్షయ్ కుమార్ పోషించిన కృష్ణుడి పాత్రలో కొద్ది సేపు బైక్ పై కనిపిస్తాడు. ఇప్పుడు తెలుగులో కూడా పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సీన్లలో బైక్ పై కనిపించ బోతున్నాడు. దీని కోసం రూ. 6.6 లక్షల విలువ చేసే ‘హైసంగ్ జివి 650 ఆక్విలా ప్రో ’ బైకును వాడుతున్నారట. ఈ బైక్ పోలికలు చూస్తుంటే లెజెండ్ సినిమా కోసం బోయపాటి ప్రత్యేక డిజైన్ చేయించిన బైక్ గుర్తుకు వస్తుంది.

ఈ బైకును చూసిన వారు బాలయ్య బాబు లాంటి బైకునే సెలక్ట్  చేసుకున్నాడంటే ఆయన ట్రెండ్ ను ఫాలోఅవుతున్నట్లే కదా ? అని అంటున్నారు. ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకున్న ‘గోపాలా గోపాలా' షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. వెంకటేష్, ఇతర తారాగణంపై సీన్లు చిత్రీకరిస్తున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ కూడా షూటింగులో జాయిన్ అవుతారు.

వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది. పవన్ ప్రక్కన నాయికను ఎంపిక చేయలేదు. కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles