Allu arjun and charan guest roles in varun tej

Allu Arjun and Charan guest roles in Varun Tej movie debut movie Gollabhama, Allu Arjun and Ram Charan moive, Naga Babu son, Varun Tej Guest Role In Varun Tej movie, Mega hero's movie

Allu Arjun and Charan guest roles in Varun Tej movie debut movie Gollabhama, Allu Arjun and Ram Charan moive, Naga Babu son, Varun Tej Guest Role In Varun Tej movie,

ముగ్గురు మెగా హీరోల మల్టీస్టారర్ ??

Posted: 06/21/2014 02:45 PM IST
Allu arjun and charan guest roles in varun tej

టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలు, ఫ్యామిలీ  ప్యాక్ సినిమాలు పెరిగిపోయిన ఈ రోజుల్లో ఇప్పుడు మెగా హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమా లు చేసేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి ‘ఎవడు ’ సినిమాలో కనిపించాడు. ఇప్పుడు వీరిద్దరు మెగా బ్రదర్ నాగబాబు కొడుకు సినిమాలో నటించబోతున్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కపించనున్నాడు. ఈ ఆటను చూడటానికి వీరిద్దరు గెస్టులుగా వస్తారట. అల్లు అర్జున్ గెస్టు పాత్ర పోషించబోతున్నాడని ఇది వరకే వార్తలు వచ్చాయి. ఇప్పుడు చరణ్ కూడా కనిపిస్తాడనే వార్తతో ఈ సినిమా పై ఇంకాస్త హైప్ ఏర్పడింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పటి వరకు ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా గొల్లభామ అని పెట్టుకున్నారు.

అయితే ప్రస్తుతం ఈ టైటిల్ టైటిల్ ఓ కులం పేరును సూచించే విధంగా ఉందంటూ కొంతమంది ఈ చిత్ర నిర్మాత దృష్టికి తీసుకెళ్లి విడుదల టైంలో వివాదం వస్తే కష్టాలు తప్పవని చెప్పడంతో ఇప్పుడు టైటిల్ ని మార్చే పనిలో బిజీగా ఉన్నారట.   వరుణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ.జె.మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles