Aagadu producers want stop ram charan gav

Aagadu producers want stop Ram Charan GAV, prakash raj aagadu controversy, 14 reels entertainment, govindudu andari vadele, ram charan, mahesh babu, sreenu vaitla, krishna vamsi

Aagadu producers want stop Ram Charan GAV, prakash raj aagadu controversy, 14 reels entertainment, govindudu andari vadele, ram charan, mahesh babu, sreenu vaitla, krishna vamsi

చరణ్ ని టార్గెట్ చేసిన మహేష్ నిర్మాతలు ????

Posted: 06/16/2014 06:45 PM IST
Aagadu producers want stop ram charan gav

ఏ క్షణంలో కృష్ణ వంశీ - రామ్ చరణ్ తేజ్ సినిమా ‘గోవిందుడు అందరి వాడేలే ’ సినిమాకు అన్ని అడ్డంకులు రావడమే కాకుండా,  ఆ సినిమా పై రోజుకో వార్త ఫిలింనగర్ నుండి బయలుదేరుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రూమర్లు చాలా చెక్కర్లు కొట్టాయి.  ఒకసారి సదరు కథ హీరో చెర్రీకి నచ్చలేదని, మెగా ఫ్యామిలీ జోక్యంతో దర్శకుడు కృష్ణవంశీ చాలా ఇబ్బంది పడుతున్నాడని, వారి కారణంగానే ఆసుప్రతి పాలయ్యాడని వార్తలు వచ్చాయి.

ఇవన్నీ సర్ధుకొని మళ్ళీ ఇటీవలే తిరిగి షూటింగు ప్రారంభం అయ్యింది. ఇలా మొదలైందో లేదో మళ్ళీ మొదలు పెట్టారు గాలి వార్తలు గాసిప్ రాయుళ్ళు. ఈ సినిమా షూటింగును మహేస్ సినిమా నిర్మాతలు అయిన 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ వారు నిలిపివేయ బోతున్నారని ఈ వార్తల సారాంశం. దీనిని బలమైన కారణం కూడా చెబుతున్నారు. మొదట ఈ సినిమాలో ఓ పాత్రకు తమిళ నటుడ్ని తీసుకున్నారు. అతని పై షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత అతన్ని తీసివేసి ప్రకాష్ రాజ్ ని పెట్టుకొని షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ప్రకాష్ రాజ్ మహేష్ సినిమా ‘ఆగడు ’ నుండి అర్థారంతరంగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వారికి ప్రకాష్ రాజ్ కొంత మొత్తం బాకీ పడ్డాడు. 14 రీల్స్ వారు...తమకు ప్రకాష్ రాజ్ వెనక్కి రెమ్యునేషన్ తిరిగి చెల్లించేవరకూ వేరే షూటింగ్ లకు హాజరు కాకుండా ఆపాలని ఫిల్మ్ ఛాంబర్ ని కోరినున్నట్లు సమాచారం. దాంతో ప్రకాష్ రాజ్ హాజరుకావాల్సిన ‘గోవిందుడు అందరివాడేలే ’ షూటింగ్ పై ఆ ఎఫెక్టు పడి షూటింగ్ ఆడిపోయినా ఆశ్చర్యం లేదని అనుకుంటున్నారు.

అయితే ఈ విషయమై అఫీషియల్ గా ఏ సమాచారమూ లేదు. మరో ప్రక్క ఈ చిత్రాన్ని అక్టోబర్ 1 వ తేదిన ఎట్టి పరిస్థితుల్లో విడుదల విడుదల చేసి తీరుతామని నిర్మాత బండ్ల గణేష్ ఇటీవలే పరిష్కరించాడు. ఈ వివాదం ఎలా సమసిపోతుందో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles