Siddharth reveals 10 years son name

Hero siddharth son name, Siddharth Reveals son name, siddarth son name dog Mowgli

Siddharth retorts to the myriad rumours about his personal life and introduces his son - his pet dog Mowgli.

నా పదేళ్ళ కొడుకు వీడే

Posted: 06/13/2014 01:54 PM IST
Siddharth reveals 10 years son name

టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోల్లో సిద్దార్థ ఒకడు. ఈయన హీరోగానే కాకుండా, వివిధ శాఖల్లో కూడా వేలెట్టి అంతగా సక్సెస్ కాకపోయినా, తనకు అన్ని శాఖల పై పట్టుందని నిరూపించుకున్నాడు.అవకాశాలు అంతో ఇంతో దక్కించుకున్నా స్టార్ హీరో మాత్రం కాలేక పోయాడు. అలాంటి సిద్దార్థ పై టాలీవుడ్ లో పుకార్లు కూడా బాగానే ఉన్నాయి. గతంలో ఈయనకు వివాహం అయిందని, ఈయనకో కుమారుడు ఉన్నాడని, మొదటి భార్యతో మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్నాడని, ప్రస్తుతం యువ హీరోయిన్లతో సరసన సల్లాపాలు సాగిస్తున్నాడని, గత కొంత కాలంగా సమంతాతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నాడని ప్రస్తుతం అతని పై ఉన్న టాక్.

అయితే వీటన్నింటి గురించి సిద్దార్థ ఓ క్లారిటీ ఇస్తూ.. అందరికి షాక్ ఇచ్చే విషయం ఒకటి చెప్పుకొచ్చాడు.  ప్రస్తుతానికి నా ధ్యాస అంత సినిమాల పైనే. ఎప్పుడైతే నేను జీవితంలో సెటిల్ అవుతానో, అందరినీ పిలిచి మరీ అన్ని విషయాలు మాట్లాడతాను. మీరందరు అనుకుంటున్నట్లు నాకు పది సంవత్సరాల కొడుకు ఉన్నాడు. వాడి పేరు మోగ్లి అని చెప్పాడు. అదే సిద్ధార్థ పెంపుడు కుక్క. ఓ స్లమ్ ఏరియాలో ఇది తనకు దొరికిందని, అప్పటి నుండే తన వద్దే పెరుగుతోందని, ఇదంటే తనకు ఎంతో ఇష్టమని సిద్ధార్థ చెప్పుకొచ్చాడు. ఇంత వరకు బాగానే ఉన్నా సమంతాతో నడిపై ఎఫైర్ ఫై మాత్రం మాట్లాడలేదు. మరి ఈయన చెప్పిన మాటలను నమ్మెచ్చా ?

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles