Nithya menon fire on director kranthi madhav

nithya menon fire on director kranthi madhav, Nitya Menon in Tollywood Movie, Nitya Menon Vs Kranthi madhav,

nithya menon fire on director kranthi madhav, Nitya Menon in Tollywood Movie, Nitya Menon Vs Kranthi madhav,

దర్శకుడికి చుక్కలు చూపిస్తుంది

Posted: 06/13/2014 12:23 PM IST
Nithya menon fire on director kranthi madhav

‘తాతకు దగ్గులు నేర్పడం ’ అనే సామెత మాదిరి నిత్యామీనన్ తీరు ఉందని అంటున్నాడు దర్శకుడు. కథానాయికలకు డిమాండ్ ఎక్కువగా ఉంటే... పారితోషికం విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తారు. కానీ తనకు నచ్చిన సినిమాలకు మాత్రమే కమీట్ అయ్యే నిత్యామీనన్ మాత్రం వెరైటీగా దర్శకుడికి చుక్కలు చూపిస్తుందట. సాధారణంగా షూటింగ్ సమయంలో కథానాయికలు దర్శకుడు ఎలా చెబితే అలా చేయాలి. వారు చెప్పిందే వేదం. కానీ నిత్యా ప్రస్తుతం నటిస్తున్న తెలుగు సినిమా ‘ మళ్ళి మళ్ళి ఇది రాని రోజు ’ అనే సినిమాలో శర్వానంద్ సరసన క్రాంతి మాధవన్ దర్శకత్వంలో నటిస్తుంది.

ఈ సినిమా షూటింగుకు సంబంధించిన పనితీరు పై ఆమె అసంత్రుప్తిగా ఉండటమే కాకుండా, ఆయన తీరు అస్సలు నచ్చడం లేదట. ఈ సినిమా సెట్లో ఫలానా సీన్ సరిగ్గా తీయడం లేదని,  ఫలానా డైలాగు మార్చమనీ ఇబ్బంది పెట్టడమే కాకుండా, తానే సలహాలు సూచనలు ఇస్తుందట. ఈమె తీరుతో సదరు దర్శకుడికి, ఈమెకు అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయట.

అసలే అమ్మడికి సినిమాలు లేని టైంలో అవకాశం ఇస్తే ఎక్కువ చేస్తుందని, ఆమెకు తనకంటే ఎక్కువగా తెలిస్తే ఆమెనే సినిమా తీసుకోవచ్చుగా అని ఆ యూనిట్ సభ్యులతో అంటున్నాడట. మరి వీరిద్దరి మధ్య జరుగుతున్న వార్ ఎంత దూరం వెళుతుందో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles