Nagababu daughter niharika exclusive interview

Nagababu Daughter Niharika exclusive interview, Niharika TV host,Mega family Niharika, Niharika Konidela interview,Niharika Konidela,Niharika interview, Nagabau daughter

Nagababu Daughter Niharika exclusive interview, Niharika TV host,Mega family Niharika, Niharika Konidela interview,Niharika Konidela,Niharika interview, Nagabau daughter

నాగబాబు కూతురుకి ఐ లవ్ యూ చెప్పాడు

Posted: 06/13/2014 10:13 AM IST
Nagababu daughter niharika exclusive interview

మెగా ఫ్యామిలీ నుండి వెండితెర పైకి ఇఫ్పటి వరకు హీరోలు మాత్రమే వచ్చారు. కానీ అందరికి భిన్నంగా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వెండితెర పైకి కాకుండా బుల్లితెర పై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్లో దూసుకుపోతుంది. మొన్నటి వరకు నాగబాబు కూతురుగానే అందరికి సుపరిచితం అయిన ఈ అమ్మడు డీజే అనే డాన్స్ ప్రోగ్రాంకి యాంకరింగ్ చేస్తూ తన ముద్దు ముద్దు మాటలతో అందర్ని ఆకట్టుకుంటుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారనుకుంటే సడన్ గా బుల్లితెర పై కనిపించి షాక్ ఇచ్చారేమిటని అడగ్గా, ఏదో అలా అడిగారు.. వర్కవుట్ అయ్యింది... షార్ట్ ఫిలింలో నటించిన మీరు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారా ? అంటే యాక్టింగ్ చేసే అంత సీన్ ఇప్పట్లో నాకు లేదు గానీ ఫ్యూచర్ లో చేయాలనిపిస్తే చేస్తానని తన ఎంట్రీ గురించి చెప్పకనే చెప్పింది.

యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన తరువాత ప్రేక్షకులకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశ్యంతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో టచ్ లో ఉన్న ఈ అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఈమెను లైక్ చేసేవారు పెరిగారు. దీంతో ఈ అమ్మడుకు మరింత క్రేజ్ వచ్చింది. ఈమె యాంకరింగ్ కి , స్టైల్ కి ఫిదా అయిన ఒకతను ఫేస్ బుక్ లో ‘ఐ లవ్ యూ  ’ కూడా చెప్పాడట. ఈ ప్రేమ సందేశాన్ని కళ్ళారా చూసిన నాగబాబు సతీమణి కంగారు పడిపోయి, నువ్వు లవ్వులో పడ్డావా ? అని డైరెక్టుగా అడిగేస్తే.. ఇలాంటివి లైట్ తీసుకోవాలి మమ్మీ... అతనెవరో నాకు తెలియదని చెప్పడంతో ఆమె ఊపిరి పీల్చుకుందట.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles