Shruti hassan facing financial problems

shruti hassan facing financial problems, financial problems, house in Mumbai, Shruti haasan, Check bounce, Shruti Hassan in financial trouble

shruti hassan facing financial problems, financial problems, house in Mumbai, Shruti haasan, Check bounce, Shruti Hassan in financial trouble

డబ్బులు ఎగ్గొట్టే ప్లాన్ వేసిందా ?

Posted: 06/09/2014 10:52 AM IST
Shruti hassan facing financial problems

ఆ మధ్యన ‘విశ్వరూపం ’ కు ముందు అప్పుల పాలై  ఉన్న ఆస్తులు అమ్మిన విలక్షణ నటుడు కమల్ హాసన్ ఆ సినిమా తరువాత అప్పులు తీర్చేశాడు. అది వేరే విషయం. ఇప్పుడు ఆయన కూతురు శ్రుతి హాసన్ కూడా అప్పుల పాలై, తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిందని ముంబై వర్గాల సమాచారం. గత కొంత కాలంగా టాలీవుడ్ లో టాప్ రేసులో గొల్డెన్ లెగ్ పేరుతో దూసుకుపోతున్న శ్రుతి హాసన్ టాలీవుడ్ కి టాటా చెప్పి బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలనుకొని ముంబైలోని అంధేరి ప్రాంతంలో అంత్యంత భారీ బడ్జెట్ తో ఓ ఫ్లాట్ ని కొనుగోలు చేసింది.

ఇన్ని సినిమాల్లో సంపాదించిన డబ్బులు ఆ ఫ్లాట్ కొనడానికి సరికోక పోవడంతో బ్యాంకునుండి కొంత రుణం తీసుకుంది. నెల నెలా కట్టాల్సిన ఇన్ స్టాల్ మెంట్ల కోసం శ్రుతి హాసన్ బ్యాంకు వారికి ఇచ్చిన చెక్ అకౌంటులో డబ్బుల లేకపోవడంతో అది కాస్త బౌన్స్ అయ్యిందట. శ్రుతి హాసన్ ఇచ్చిన చెక్ తో షాక్ తిన్న బ్యాంకు అధికారులు ఆమె నుండి డబ్బులు రాబట్టుకునే ప్రయత్నంలో ఉన్నారట.

అయితే ముంబై జనాలు మాత్రం శ్రుతి హాసన్ సంపాదించిన దానిలో చాలా వరకు జల్సాలకు, సోకులకు ఖర్చు చేస్తే ఇల్లు కొనడానికి డబ్బులు ఎలా ఉంటాయి ? డబ్బులు లేనప్పుడు అంత ఖరీధైన ఇల్లు కొనుక్కొని ఆర్థిక కష్టాలు తెచ్చుకోవడం అవసరమా ? అని ప్రశ్నలు వేస్తున్నారు. మరి శ్రుతి ఇచ్చిన చెక్ నిజంగానే బౌన్స్ అయ్యిందా ? లేక డబ్బులు ఎగ్గొట్టే ప్లాన్ ఏమైనా వేసిందా ? ఆమె నోరు విప్పితేగాని అసలు సంగతి తెలియదు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles