Rudramadevi nizam and vizag rights buys dil raju

Rudramadevi Nizam and Vizag rights, Dil Raju buys rudramadevi rights, stereoscopic 3D film, Rudramadevi, Gunasekhar directions,

Rudramadevi Nizam and Vizag rights buys Dil Raju.

రుద్రమదేవి హక్కుల్ని సొంతం చేసుకున్నాడు

Posted: 06/09/2014 09:59 AM IST
Rudramadevi nizam and vizag rights buys dil raju

నిర్మాణ దశలో ఉండగానే బడా చిత్రాల ఏరియా హక్కులను దక్కించుకోవడానికి డిస్ట్రబ్యూటర్స్ పోటీ పడుతున్నారు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ భారీ బడ్జెట్ తో భారత దేశపు తొలి స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా గుణా టీమ్ వర్క్స్ బేనర్ పై తన సొంత నిర్మాణంలో అనుష్క ప్రధాన పాత్రలో ‘రుద్రమ దేవి ‘ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ చిత్రానికి సంబంధించిన వ్యాపారం ఊపందుకుంది.

ఈ చిత్రానికి సంబంధించిన నైజాం, విశాఖ ఏరియా హక్కుల్ని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దాదాపు అరవై కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రైట్స్ దిల్ రాజు కొన్నాడంటే సినిమా పై, గుణశేఖర్ పై గట్టి నమ్మకం ఉండటమే అంటున్నారు. దిల్ రాజు చేతికి  హక్కులు వెళ్లడంతో సినిమాకు వ్యాపారం పరంగా మరింత క్రేజ్ పెరిగిందట.

దీంతో మిగతా ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ కి గుణశేఖర్ భారీ రేటు చెబుతున్నాడట. మరి పెట్టిన పెట్టుబడి రావాలంటే ఈ మాత్రం డిమాండ్ ఉండాల్సిందే అంటున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో రాణా, బాబాసెహగల్ లాంటి వారు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అర్జున్ గోన గన్నారెడ్డిగా కనిపించబోతున్నాడు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles