Rajinikanth early life in kannada

Rajanikanth Raj Bahadur,Bus conductor,Film Institute, Kollywood, Kamal hassan, Rajini, Superstars

Rajinikanth Early Life In Kannada, Rajanikanth Raj Bahadur,Bus conductor,Film Institute, Kollywood, Kamal hassan, Rajini, Superstars

కన్నడ తెర పై రజినీ జీవిత చరిత్ర

Posted: 05/30/2014 10:51 AM IST
Rajinikanth early life in kannada

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చాడో అందరికి తెలిసిందే. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే నైజం రజినీకాంత్ ది. అలాంటి రజినీకాంత్ జీవితంలో కీలకమైన వ్యక్తుల్లో బహుదూర్ ఒకరు. ఇంతకీ బహుదూర్ ఎవరనేగా మీ డౌట్ . మన సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ఇండస్ట్రీకి రాకముందు కండక్టర్ గా చేసేవాడు. ఆ టైంలో బహదూర్ ఆ బస్‌కి డ్రైవర్‌గా చేసేవారు. అప్పుడు తన స్నేహితునిలో నటనాసక్తిని గ్రహించి, ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరడానికి తన వంతు సహాయం చేశారు బహదూర్.

అనంతరం రజనీ నటునిగా మారడం, సూపర్ స్టార్‌గా ఎదగడం అందరికీ తెలిసిందే. ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత పాత స్నేహితులను కొంతమంది మర్చిపోతారు. రజనీ మాత్రం అలాంటి వ్యక్తి కాదు. ఇప్పటికీ రాజ్ బహదూర్‌తో తన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఇద్దరి స్నేహం ఆధారంగా కన్నడంలో ‘వన్ వే’ అనే చిత్రం రూపొందుతోంది. తమిళంలో ‘ఒరు వళి శాలై’ అనే పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో స్నేహితుని పాత్రను రాజ్ బహదూరే స్వయంగా పోషిస్తున్నారు. మరి బహుదూర్ రజినీ తో స్నేహాన్ని మాత్రమే పాయింట్ గా తీసుకున్నాడా ?

తన జీవితంలోని కొన్ని ఒడిదొడుకులకును కూడా చూపించబోతున్నాడా ? అనేది సినిమా విడుదల అయితేగానీ తెలియదు. ఈ చిత్రానికి రుషిరాజ్ దర్శకత్వం వహించారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే...రజనీకాంత్ కమల్ హాసన్ సినిమాలో గెస్ట్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి వీరి ఇద్దరికి ఆది గురువు అయిన కె. బాలచందర్ దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles