Allu arjun and jr ntr multi starrer movie

Jr.NTR Allu Arjun multi starrer movie, Jr.NTR and Allu Arjun narrated story, Dil Raju producer, Venu Sriram, Oh My Friend fame

Dil Raju and his director Venu Sriram (Oh My Friend fame) are busy in getting that Mega hero and Nandamuri hero sign yet another biggest multi-starrer film.

బన్నీ-ఎన్టీఆర్ మల్టీస్టారర్ వర్కవుట్ అయ్యేనా ?

Posted: 05/30/2014 12:23 PM IST
Allu arjun and jr ntr multi starrer movie

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక ప్రతి గాలి సంచరిస్తూనే ఉంటుంది. అలాంటి వార్తలను నమ్మాలా లేదా అని సినీ జనాలు తెగ ఆలోచిస్తారు. అలాగని కొంత మంది కొట్టిపారేయలేరు. కొన్ని గాలి వార్తలు నిజమైతే, మరికొన్ని గాలికే కొట్టుకుపోతాయి. ఇప్పుడు కూడా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల హవా ఎక్కువగా ఉన్న రోజుల్లో నందమూరి ఫ్యామిలీ హీరో ఎన్టీఆర్, మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ కలిసి ఓచిత్రం చేయబోతున్నారని ఆ గాలి వార్త సారాంశం.

ఇప్పటికే అల్లు అర్జున్ రామ్ చరణ్ సినిమాలో చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో చేయడానికి సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇప్పటికే నాగార్జునతో మల్టీస్టారర్ చేస్తున్న ఎన్టీఆర్ బన్నీతో చేస్తే అతనికిది రెండో మల్టీస్టారర్ అవుతుంది. ఈ సినిమాను . ఓ మై ఫ్రెండ్ సినిమాను తెరకెక్కించిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్లో రూపుదిద్దుకోబోతుందని అంటున్నారు.

మొదట సింగిల్ హీరోతోనే చేద్దామనుకున్న దిల్ రాజు కథ ఇద్దరు హీరోలకు సంబంధించినదిగా వేణు రాసుకోవడంతో దిల్ రాజు బన్నీని కలిస్తే, కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం కథ ఫైనల్ స్టేజిలో ఉందని, ఇది కొలిక్కి వచ్చిన తరువాత అఫీషియల్ ప్రకటన చేస్తారని అంటున్నారు. అప్పటి వరకు ఇది గాలి వార్తగానే ఎంజాయ్ చేయండి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles