Ram charan sorry to mani ratnam story

Ram Charan sorry to Mani Ratnam Story, Allu arjun, Mahesh Babu, Mani Ratnam, Multistarrer, nagarjuna, Ram Charan

Ram Charan sorry to Mani Ratnam Story, Allu arjun, Mahesh Babu, Mani Ratnam, Multistarrer, nagarjuna, Ram Charan

రామ్ చరణ్ కూడా మణితో చేయనన్నాడు

Posted: 05/27/2014 02:38 PM IST
Ram charan sorry to mani ratnam story

ఇటీవలి కాలంలో సినిమా దర్శకులు హీరోల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగితే కానీ ఓ కథ ఫైనల్ కావడం లేదు. ఒకవేళ కథ నచ్చినా, సదరు హీరో ఆ దర్శకుడి గత సినిమాల ట్రాక్ రికార్డు చూసి అన్ని నచ్చి, అతి తక్కువ కాలంలో సినిమా తీసేసి, అన్ని  వర్గాల ఫ్యాన్స్ ఆకట్టుకునే విధంగా కథ ఉంటే వెంటనే ఓకె చెబుతున్నారు లేదనంటే  ఎంత పెద్ద దర్శకుడైనా సరే ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు తప్పితే పెద్ద దర్శకుడు కదా అని కమీట్ అయ్యి, సినిమా చేశాక బాధ పడే పరిస్థితి లేదు.

ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే ఫాలో అవుతున్నాడు. టాలీవుడ్ లో ప్రేమ కథా చిత్రం, బాలీవుడ్ లో మాస్ చిత్రాలు చేసి బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన చెర్రీ పూర్తి స్థాయి మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇటీవలే ఎవడు తో కాస్తంత రిలీఫ్ అయిన చరణ్ ప్రస్తుతం క్రిష్ణవంశీ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. దాని తరువాత బోయపాటి శీను, శీను వైట్ల కమర్షియల్ దర్శకుల సినిమాకు కమీట్ అయ్యడు కానీ మణిరత్నం లాంటి టాప్ దర్శకుడికి నో చెప్పాడు. నాగార్జున, మహేష్‌బాబుతో ఒక సినిమా చేద్దామని మణిరత్నం ప్లాన్‌ చేసుకున్నాడు.

నాగార్జున ఓకే అన్నాడు కానీ మహేష్‌ మాత్రం ఖాళీ లేదని చెప్పేసాడు. దాంతో చరణ్‌, అల్లు అర్జున్‌తో అదే సినిమా చేయాలని మణిరత్నం మొన్ననే చిరంజీవిని కలిసాడు. కానీ చరణ్‌ కూడా తాను చాలా బిజీగా ఉన్నానని, ఇప్పుడు ఒక సినిమాపై ఏడాదికి పైగా సమయం కేటాయించడం అసాధ్యమని, తనతో పని చేయడానికి సిద్ధంగా ఉన్న ఇతర దర్శకులని బాధ పెట్టలేనని సున్నితంగా ఈ ఆఫర్‌ని తిరస్కరించి మణిరత్నంకి సారీ చెప్పేసాడు.

దీనికి కారణం మణిరత్నం గత రెండు మూడు చిత్రాల ఫలితమే అంటున్నారు. ఒకప్పుడు మణి తో సినిమాలు చేయడానికి వెంటబడిన హీరోల చుట్టూ మణిరత్నం తిరగడం చూస్తుంటే ఆయన్ను టాలీవుడ్ వారు ఎంత దూరం పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles