Kochadaiyaan 50 crore mark at box office

Kochadaiiyaan 3days collections, Kochadaiiyaan, Kochadaiiyaan 42 crore in 3 days, rajinikanth, kochadaiyaan box office collections, kochadaiiyaan box office, deepika padukone, tamil box office.

ajinikanth starrer Kochadaiiyaan collection is racing towards Rs 50 crores mark at Box Office.

మూడు రోజల్లో 42 కోట్లు కొల్లగొట్టింది...

Posted: 05/27/2014 10:55 AM IST
Kochadaiyaan 50 crore mark at box office

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా విడుదల అవుతుందంటే అభిమానుల కోలాహాలం అంతా ఇంతా కాదు. కానీ ఇటీవల ఆయన తన కూతురు సౌందర్య దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘కొచ్చాడయాన్ ’ లో నటించాడు. గత వారం విడుదల అయిన ఈ చిత్రం థియేటర్లలో పెద్ద సందడి చేయడం లేదు.

ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా దీని గురించి పెద్దగా మాట్లాడుకోవడం లేదు. చాలా రోజులు ఊరించి, ఊరించి చివరకు విడుదలైన ఈ చిత్రం టాక్ పరంగా పెద్దగా లేకపోయినా కలెక్షన్లు మాత్రం అదర గొడుతుంది. విడుదల అయిన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలో 30 కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్ లో 12 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీను షేక్ చేస్తుందని అంటున్నారు.

యుఏఈ, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో కోచ్చడయాన్‌కు మంచి ఆదరణ లభిస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు. భారతీయ సినీ చరిత్రలోనే బాలీవుడ్ చిత్రాలు అవతార్, టిన్‌టిన్ తరహాలో మోషన్ కాప్చరింగ్ టెక్నాలజీలో 3డీ ఫార్మెట్‌లో తెరకెక్కిన తొలి చిత్రంగా కోచ్చడయాన్ రికార్డు కెక్కింది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles