Trisha launch balakrishna godse movie

Trisha launch balakrishna Godse Movie, Trisha roped With Nandamuri balakrishna, Trisha in Godse movie, Rroducer Rudrapati Ramana Rao, Director Satyadeva

Balakrishna Godse movie grand launch of the film on June 2nd in Hyderabad. Trisha has been roped in to cast opposite Balakrishna.

బాలయ్యది దానికి కొట్టబోతున్న త్రిష

Posted: 05/26/2014 03:25 PM IST
Trisha launch balakrishna godse movie

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ కిరిటాన్ని నెత్తినేసుకొని తరిగిన త్రిషకు గత కొంత కాలం నుండి అవకాశాలు లేక ఖాళీగా ఉంటూ, అప్పుడప్పుడు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తుంది. ఏజ్ తో సంబంధం లేకుండా కుర్ర హీరోల నుండి సీనియర్ హీరోల వరకు అందరితో కమీట్ అవుతుంది.

ఈనేపథ్యంలోనే ఈ అమ్మడుకు టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన బాలయ్యతో సినిమా చేసే అవకాశం వచ్చింది. ముందు వెనకా ఆలోచించకుండా, కాస్తంత ఎక్కవ డబ్బులు గుంజేసి సినిమా చేసేద్దాం అని డిసైడ్ అయ్యి, కోటిన్నర ఇస్తేనే చేస్తానని చెప్పింది. దీంతో దర్శక నిర్మాతలు త్రిషను ప్రక్కన పెట్టారని అనుకున్నారు. కానీ బాలయ్య సరసన హీరోయిన్ గా చేయడానికి ఎవరూ ముందుకు రాక నానా తంటాలు పడిన ‘లెజెండ్ ’ నిర్మాతల విషయం గుర్తొచ్చి, ఆమె అడిగినన్ని ఇవ్వడానికి సిద్దపడ్డారు.

హీరో, హీరోయిన్ రెడీ ఉండటంతో దర్శకుడు సత్యదేవా ఈ ‘గాడ్సే ’ చిత్ర నిర్మాణాన్ని జూన్ 2వ తారీఖు నుండి ప్రారంభించ బోతున్నారు. ఓ వైపు ఎమ్మెల్యేగా, మరో వైపు హీరోగా బాలయ్య బిజీ కాబోతున్నాడు.  ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేస్తారట. త్రిష కొబ్బరికాయ కొట్టిన వెంటనే, బాబు గారు కెమెరా స్విచ్ నొక్కుతారట.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles