Miss india vanya mishra to romance kalyanram

Vanya Mishra movies, Vanya Mishra Miss India,Vanya Mishra,vanya misha in telugu, vanya mishra in kalyanram movie, vanya mishra act with kalyan ram

Miss India World 2012, Vanya Mishra, is all set to make her T-Town debut. This lady opposite Kalyan Ram in his upcoming Telugu film.

మిస్ ఇండియాతో నందమూరి హీరో రొమాన్స్

Posted: 05/26/2014 02:53 PM IST
Miss india vanya mishra to romance kalyanram

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరియర్లో చెప్పుకోదగ్గ హిట్లు ఏమీ లేకపోయినా, సినిమాలు చేయడం మాత్రం ఆపడు. తనతో ఎవరూ సినిమాలు తీయకపోయినా, ప్రేక్షకుల్లో ఉండటానికి తానే దర్శక, నిర్మాతగా మారి సినిమాలు చేస్తుంటాడు. అలా చేసిందే కత్తి.

ఆ సినిమా అనుకున్న విజయాన్ని సాధించకపోయినా, నిరాశ చెందకుండా ఇప్పుడు కొత్త దర్శకుడు మల్లికార్జన్ కి అవకాశం ఇచ్చాడు. ఈయన దర్శకత్వంలో చేయబోయే సినిమాకు ‘షేర్ ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నటించడానికి ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన వన్య మిశ్రాను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం.

2012లో మిస్ ఇండియాగా ఎంపికైన ఈ అమ్మడు తెలుగు తెరకు కళ్యాణ్ రామ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles