Ntr nagarjuna multistarrer film confirm

NTR-Nagarjuna Multistarrer, NTR-Nagarjuna Film Confirm, Akkineni Nagarjuna, Young Tiger NTR, Akkineni Nagarjuna Confirms Movie With NTR, Vamsi Paidipally,

Akkineni Nagarjuna and Young Tiger NTR will be teaming up for a multistarrer movie.

నాగ్-ఎన్టీఆర్ మల్టీస్టారర్ కన్ఫర్మ్

Posted: 05/19/2014 09:52 AM IST
Ntr nagarjuna multistarrer film confirm

మొన్నటి వరకు టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు, నాగార్జునలు ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంల మల్టీస్టారర్ సినిమా తెరకెక్కబోతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ సినిమా అటకెక్కి, నాగార్జున, ఎన్టీఆర్ ల కాంబినేషన్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమాకు సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయాన్ని నాగార్జున అఫీషియల్ గా కన్ ఫర్మ్ చేశాడు.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపీపీ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తారని సమాచారం. మణి రత్నం సినిమా పై గతంలో మహేష్ భార్య నమ్రత, నాగార్జునలు కూడా కన్ఫర్మ్ చేశారు. ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్టు నుండి ఇద్దరు తప్పుకున్నట్లు ఇటీవలి కాలంలో వార్తలు చెక్కర్లు కొట్టాయి. దీని పై నాగార్జున వివరణ ఇస్తూ ఆమధ్య మణిరత్నం నాకు కథ చెప్పిన మాట వాస్తవమే. నేను కూడా చేస్తానని చెప్పాను.

అయితే, మళ్లీ ఆయనే ఫోన్ చేసి సినిమా లేదు అని కూడా చెప్పారు అందుకే ఈ ప్రాజెక్టు కేన్సిల్ అయ్యిందని చెప్పుకొచ్చారు. కానీ సినిమా జనాలు మాత్రం గత కొంత కాలంగా ప్లాపుల్లో ఉన్న మణి రత్నం పై నమ్మకం లేక మహేష్ తప్పుకుంటే నాగ్ కూడా తప్పుకున్నాడని అనుకుంటున్నారు.

ఇటీవల రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో ‘ఎవడు ’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి ఈ సినిమాలో నాగార్జున పాత్రను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయబోతున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో వున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles