Kochadaiiyaan release postponed may 23

Kochadaiiyaan Release Postponed, rajinikanth, kochadaiiyaan, kochadaiyaan box office collections, kochadaiiyaan box office, deepika padukone

The release of Rajinikanth‘s much awaited movie ‘Kochadaiiyaan’ has been pushed back again to May 23.

రజినీ ఫ్యాన్స్ కి తప్పని నిరీక్షణ

Posted: 05/08/2014 09:03 AM IST
Kochadaiiyaan release postponed may 23

సౌత్ ఇండియా సూపర్ స్టార్ నటించిన ‘కొచ్చాడయాన్ ’ సినిమాకు ముహూర్తం అస్సలు కుదరట్లేదు. ఈ సినిమాను ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన ఆ చిత్రయూనిట్ తాజాగా మరోసారి రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు అఫీషియల్ ప్రకటన చేశారు. ముందు ప్రకటించిన తేది ప్రకారం ఈ సినిమాను ఈనెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలి. భారీ ఎత్తున విడుదల అవుతున్న ఈ సినిమా టిక్కెట్లు 13 వేల వరకు చెన్నై మల్టీప్లెక్సుల్లో అమ్ముడయ్యాయి. కానీ తీరా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.

సాంకేతిక కారణాల వల్లే ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. అయితే సినిమా వర్గాల నుండి విసిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వాయిదాకు ఆర్థిక కారణాలే కారణం అని అంటున్నారు. ఏదేమైనా ‘కొచ్చాడియాన్ ’ బొమ్మ పడాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు రజినీకాంత్ కుమార్తె దర్శకత్వం వహించాడు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మోషన్ కాప్చర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles