Anjali talking about kissing scenes

Anjali talking about Kissing Scenes, Anjali not accept such scenes, telugu film actress anjali

Anjali talking about Kissing Scenes, Anjali not accept such scenes, telugu film actress anjali

అంజలి అలాంటివి చేయనంటుంది

Posted: 05/05/2014 02:48 PM IST
Anjali talking about kissing scenes

బాలీవుడ్‌ సినిమాల్లో హాట్ హాట్ కిస్సులు, బికినీ షోలు, లిప్‌లాక్‌లకు హద్దే ఉండదు. బడా హీరోయిన్ల నుండి చిన్నా చితకా హీరోయిన్ల వరకు అందరు వాటికి సిద్దమే. అక్కడి హీరోయిన్లకు అలవాటైన ఆ కల్చర్ టాలీవుడ్ నుండి అక్కడికి వెళ్లిన హీరోయిన్లు కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. అవుతున్నారు కూడా. కానీ టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అంజలి ఇటీవలే బాలీవుడ్ అడుగుపెట్టింది.

ఈ అమ్మడు కూడా అలాంటి హీరోయిన్ల జాబితాలో చేరిపోతుందని అనుకున్నారు. కానీ తాను మాత్రం  కిస్సింగ్ సీన్స్‌కి, బికినీలకు ఒప్పుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. బాలీవుడ్ లోకి వెళ్లిన ప్రతి వారు హద్దు మీరి నటిస్తున్నారు. తాను మాత్రం అలా చేయనని, ఎంత పెద్ద హీరో అయినా, ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా కానీ హద్దుమీరి నటించనని ఒకవేళ కాదు కుదరదు అని చెబితే అవకాశాన్నైనా వదులుకుంటానని చెబుతుంది. బాలీవుడ్ కి వెళ్తూ వెళ్తూనే ఇన్ని కండీషన్లు పెడితే అక్కడి వారు ఈ అమ్మడుకు ఎవరు అవకాశాలు ఇస్తారు చెప్పండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh