Nithya menon to romance allu sirish

Heroine Nithya Menen, Nithya menon romance with allu sirish, nithya with mega hero, allu sirish with nithya menon

Heroine Nithya Menen will be pairing with hero Allu Sirish in her next film which will be directed by Prema Ishq Kadhal fame Pavan Sadineni.

నిత్యా మీనన్ మెగా హీరోతో రొమాన్స్

Posted: 04/28/2014 08:15 PM IST
Nithya menon to romance allu sirish

కేరళ కుట్టి , పొట్టి పిల్ల నిత్యా మీనన్ ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల్లో పలుచపలుచగా కనిపిస్తుంది. ‘ఇష్క్, గుండెజారి గల్లంతైందే ’ సినిమాల తరువాత కనిపించని ఈ అమ్మడు ఇప్పుడు మెగా హీరో ప్రక్కన ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో ఆచితూచి సినిమాలకు కమీట్ అవుతున్న ఈ అమ్మడు మెగా హీరో అల్లు శిరీష్ తరువాత చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి కమీట్ అయ్యింది.

ఇప్పటి వరకు రెండు సినిమాల్లో నటించి, మూడో సినిమాకు సిద్దం అవుతున్న శిరీష్ తన రెండో సినిమా ‘కొత్త జంట’ పై చాలా  ఆశలు పెట్టుకున్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జూలైలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభంకాబోతోంది. నిత్యామీనన్ డైరెక్ట్‌గా చేసిన తెలుగు సినిమాలు హిట్ కావడం, నితిన్ అదృష్టాన్ని మలుపు తిప్పిన ఈ తార, తన అదృష్టాన్ని కూడా మార్చేస్తుందని భావిస్తున్నాడేమో, శిరీష్ తన పక్క హీరోయిన్ గా ఆమెను ఎంచుకున్నాడట.

గతంలో ‘ప్రేమ ఇష్క్ కాదల్ ’ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రానికి దర్శత్వం వహించబోతున్నాడు. కథలో దమ్ము, కాస్త పేరున్న హీరోల సినిమాలకే కమీట్ అవుతున్న నిత్యా ఈ సినిమా తరువాతనైనా వరుస భాన్సులు కొట్టేస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles