Good rate for allu vari kotha janta

kotha janta, allu vari kotha janta, Kotha Janta Movie, allu aravind, allu arjun, Kotha Janta Telugu movie, Kotha Janta may 1 released, director maruthi.

Good rate for allu vari kotha janta

మంచి రేటు పలుకుతున్న అల్లు వారి జంట ?

Posted: 04/26/2014 12:50 PM IST
Good rate for allu vari kotha janta

ప్రముఖ నిర్మత అల్లు వారి అల్లారి అబ్బాయి  శిరీష్  వెండితెర ప్రవేశం చేసిన విషయం తెలిసిందే.  అల్లు శిరీష్  నటించిన మొదటి సినిమా కు అనుకున్నంత స్పందన రాలేదని చెప్పాలి.   అయితే దానికి అనేక కారణాలు. కానీ ఇప్పుడు కొత్తగా  రెండో  సినిమాతో..తెలుగు ప్రేక్షకులకు ముందుకు కొత్తజంటగా రాబోతున్నారు.  మారుతి దర్శకత్వంలో అల్లు వారి అబ్బయి కొత్త జంటగా వస్తున్నారు.  ఇప్పుడు అల్లువారి కొత్త జంటకు మంచి రేటు పలికింది. 

చిన్న సినిమాలను టీవీ చానెల్స్ కొనడమే మానేసిన ప్రస్తుత తరుణంలో, మారుతి దర్శకత్వంలో రూపొందిన 'కొత్తజంట' చిత్రాన్ని మాటీవీ మంచి రేటుకి కొనేసింది.

అల్లు శిరీష్, రెజీనా జంటగా గీతా ఆర్ట్స్ నిర్మించిన చిత్రం కావడంతో, మాటీవీ వారు ఏకంగా 2 కోట్ల రూపాయలకు ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని తీసుకున్నట్టు సమాచారం. మామూలుగానే మారుతి సినిమాలకు క్రేజ్ వుంది. దీనికి తోడు అల్లు అరవింద్ సినిమా కావడంతో దీనికి మరికాస్త ఎక్కువ రేటు ఇప్పించుకున్నట్టు చెబుతున్నారు. 

ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేస్తున్నారు. అల్లు వారి కొత్త జంట చేసే  రొమాన్స్  తెరపైనే చూడాలి. 

ఆర్ఎస్   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles