Mumbai production house acquires gabbarsingh 2

Gabbar Singh 2, Gabbar Singh, pawan kaylyan, mumbai production house acquires gabbarsingh-2, Gabbar Singh 2 movie, pawan election campaign 2014, Pawan kalyan Gabbarsingh 2,

mumbai production house acquires gabbarsingh-2

అమ్ముడుపోయిన పవన్ కళ్యాణ్?

Posted: 04/26/2014 11:25 AM IST
Mumbai production house acquires gabbarsingh 2

పవన్ కళ్యాణ్ అమ్మడుపోవటం ఏమిటనుకుంటున్నారా? అవును మీ చదివింది కరెక్టే.  పవన్ కళ్యాణ్  నటించిన  గబ్బర్ సింగ్ సినిమా రికార్డులు బద్దలు కొట్టిన విషయం అందరికి తెలిసిందే.  అదే సినిమా  సీక్వేల్ గబ్బర్ సింగ్ 2గా తీయటానికి  పవన్ సిద్దమైన విషయం తెలిసిందే.  కానీ ఆయన రాజకీయ ఎంట్రీతో  కొంచెం సమయం వెనక్కి వెళ్లింది.  

ఈ సమయంలో నే పవన్ కళ్యాణ్  ఇక సినిమాలు చేయడనే మాటలు టాలీవుడ్ లో వినిపించాయి. కానీ పవన్ వెంటనే.. గబ్బర్ సింగ్ 2 సినిమా చేస్తున్నాం అని మీడియా ప్రకటన చేయటంతో.. అభిమానులు, దర్శకులు, నిర్మాతలు అందరు ఊపిరీ పీల్చుకున్నారు.  ఆయనకున్న క్రేజ్ కో, ఆయన పవర్ కో. ఏమో తెలియదు గానీ.. అందరు పవన్ మైకంలో పడిపోతారు.

అయితే గబ్బర్ సింగ్ 2  సినిమా ఇంకా సెట్ మీదకు వెళ్లకుండానే  సరికొత్త రికార్డు తెచ్చిపెట్టింది.  పవన్ కల్యాణ్  

సినిమా ఇంకా ప్రారంభం కాకుండానే అమ్ముడుపోయిన వైనం తాజాగా పవన్ కల్యాణ్ సినిమా విషయంలో చోటు చేసుకుంది.  పవన్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్ 2' సినిమా రూపొందనున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. పవన్ కల్యాణ్ ఎన్నికల హడావిడిలో వున్నందున వాయిదా పడుతూ వచ్చింది. జూన్ నెలలో దీని షూటింగ్ ప్రారంభించడానికి నిర్మాత శరత్ మరార్ ప్లాన్ చేస్తున్నాడు.  ఇదిలా ఉండగానే, ఈ సినిమా ఏపీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ అవుట్ రేట్ కి తీసుకుందనీ, ఇందుకు గాను భారీ మొత్తం చెల్లించిందనీ సమాచారం. కాగా, ఈ సినిమాలో 'ఆషికి 2' ఫేం శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది!

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles