Dimpy rahul mahajan headed for splitsville

rahul mahajan, dimpy mahajan, divorce, rahul dulhaniya le jayega, shweta singh, payal pohatgi

Rahul and Dimpy were too much in love with each other and decided to get married on the reality show itself.

రాహుల్ రెండో భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడు

Posted: 04/26/2014 10:10 AM IST
Dimpy rahul mahajan headed for splitsville

ప్రముఖ రాజకీయవేత్త, భారతీయ జనతా పార్టీ నేత కీ.శే. ప్రమోద్ మహాజన్ కుమారుడు అయిన రాహుల్ మహాజన్ తన భార్య ఢింపి మహాజన్ కి త్వరలో విడాకులు ఇవ్వబోతున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి నేషనల్ మీడియా వర్గాలు. నాలుగు సంవత్సరాల క్రితం ‘రాహుల్ దుల్హానియా లేజాయె ’ అనే స్వయం వరం షోని నిర్వహించి అందులో నుండి ఈమెను ఏరి కోరి మరీ పెళ్ళి చేసుకున్నాడు.

  పెళ్లియిన కొన్నాళ్ళ తరువాత రాహుల్ డింపీని వేధించడంతో అప్పటి నుండి విడివిడిగా ఉంటున్నారట. కారణం దుబాయ్‌కి చెందిన ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఓనర్‌తో డింపీ క్లోజ్‌గా మూవ్ కావడంతో ఇక ఆమెకి, రాహుల్‌కి మధ్య దూరం పెరిగిపోయింది. కొన్నాళ్ల క్రితమే రాహుల్ ని ముంబైలోనే వదిలి పెట్టి దుబాయ్ కి చెక్కేసిందట.

డింపీని వివాహం చేసుకోక ముందే రాహుల్ కి శ్వేతాసింగ్ తో వివాహం అయ్యింది. ఆమెతో కొన్నాళ్ళు కాపురం చేసిన తరువాత 2008లో విడాకులు ఇచ్చేసి డింపీని చేసుకున్నా, మనోడు చాటు మాటుగా నటి పాయల్ రోహతగితో డేటింగ్ చేసేవాడని ప్రచారం సాగింది. ఈమెకు అఫీషియల్ విడాకులు ఇచ్చిన తరువాత మళ్లెవరిని చేసుకుంటాడో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles