Sudeep gets 6 crore for tamil movie

sudeep, vijay, chimbudevan, shruti hassan, deepika padukone, Tamil filmmaker Chimbudevan,

Vijay next film after Kaththi Sudeep gets 6 crores salary Vijay next film after Kaththi Sudeep gets 6 crores salary Vijay next film.

హీరోల కంటే విలన్ కే ఎక్కువ పారితోషికం

Posted: 04/24/2014 05:04 PM IST
Sudeep gets 6 crore for tamil movie

శాండల్ వుడ్ హీరోగా, తెలుగు ప్రేక్షకులకు విలన్ గా సుపరిచితం అయిన కిచ్చా సుదీప్ ‘ఈగ ’ సినిమాలో తన నటనతో ఆకట్టుకొని క్రేజీ స్టార్ అయిపోయాడు. హీరోగా ఓ వైపు రాణిస్తూనే మరో వైపు తనలోని విలనిజాన్ని ప్రేక్షకులకు చూపిస్తున్నాడు. త్వరలో తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టబోతున్నాడు.

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొంద బోతుంది. దీనిలో సుదీప్ విలన్ గా నటించ బోతున్నాడు. ఇందుకోసం ఆయన అక్షరాల 6 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోబోతున్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే శాండల్‌వుడ్‌లో అగ్ర కథానాయకుడిగా ఉన్న దర్శన్ ప్రస్తుతం అత్యధికంగా రూ.5.5 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నారు.

ఇక ఇప్పుడు దర్శన్ రికార్డును బ్రేక్ చేస్తూ రూ.6 కోట్ల పారితోషికాన్ని సుదీప్ అందుకుంటున్నారు. ఫ్యాంటసీ కదా చిత్రంగా రూపొందే ఈ సినిమాలో శ్రీదేవి కూడా ఓ కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే కథానాయికలుగా దీపికా పదుకొనే, శృతి హాసన్ నటిస్తారట. టాలీవుడ్ లో ఉన్న టాప్ విలన్లు కూడా ఇంత భారీ మొత్తం అందుకోలేదని అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles