Pawan special gift ism book to kona venkat

Kona Venkat, Pawan Kalyan, ISM book, Geethanjali first look, Anjali in Geethanjali, Pawan Kalyan's ISM Book, Pawan gifts ISM book to Kona Venkat

Jana Sena Party founder Pawan Kalyan has gifted his party ideology book ISM to writer Kona Venkat. Apparently Kona reached Pawan to launch the first look poster of his next project Geethanjali.

కోన వెంకట్ గాల్లో తేలిపోతున్నాడు

Posted: 04/16/2014 03:06 PM IST
Pawan special gift ism book to kona venkat

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకొని, మంచి రచయితగా పేరు తెచ్చుకున్న కోన వెంకట్ కి జీవితంలో మరచిపోలేని కానుక వచ్చింది టాలీవుడ్ స్టార్ హీరో నుండి. ఆ కానుకను చూసుకొని తెగ మురిసిపోతున్నాడు వెంకట్. ఇంతకు కోన వెంకటన్ కి గిప్ట్ ఇచ్చింది ఎవరో తెలుసా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రచయిత నుండి మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా మారి తాను దర్శకత్వం వహిస్తున్న ‘గీతాంజలి ’ సినిమా లోగోను పవన్ కళ్యాణ్ తో విడుదల చేయించాడు.

ఈ సినిమా లోగో విడుదల తరువాత పవన్ కళ్యాణ్ కోనవెంకట్ కి తాను సమకాలీన రాజకీయాల పై రాసిన ‘ఇజం ’ పుస్తకాన్ని గిఫ్టుగా ఇవ్వడమే కాకుండా, మొదటి పేజీలో ‘‘ప్రియమైన సోదరుడు కొనకు….ప్రేమతో పవన్ ’’ అంటూ రాసి సంతకం కూడా చేశాడు. ఇది చూసుకొని ఇప్పుడు కోన వెంకట్ తెగ మురిసిపోతున్నాడు.

పవన్ ఇచ్చిన గిఫ్టు సంతోషంలో తేలిపోతున్న కోన వెంకట్ ఆ పుస్తకాన్ని చదివాడో లేదో కానీ, ఆ సంతోషంలో మొదటి పేజీకి స్కాన్ చేసి ట్విట్టర్ లో పోస్టు కూడా చేశాడు. ఈ సంఘటనతో పవన్ కళ్యాణ్ కి కోన వెంకట్ కి మధ్య ఎలాంటి ఫ్రెండ్ షిప్ ఉందో అందరికి తెలిసిందంటున్నారు వారిద్దరి సన్నిహితులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles