Race gurram movie satellite rights rate

Race Gurram Movie satellite rights, Allu Arjun, Shruti Haasan starrer Race Gurram directed by Surender Reddy has fetched good.

Race Gurram Movie satellite rights Details, Allu Arjun, Shruti Haasan starrer Race Gurram directed by Surender Reddy has fetched good.

భారీ రేటుకు శాటిలైట్స్ రైట్స్

Posted: 04/14/2014 06:13 PM IST
Race gurram movie satellite rights rate

అల్లు అర్జున్ కి తన కొడుకు పుట్టిన తరువాత అన్ని కలిసి వస్తున్నాయనే చెప్పాలి. ఆయన జన్మించిన తరువాత విడుదల ‘రేసు గుర్రం ’ హిట్ టాక్ రావడమే కాకుండా, బాక్సాఫీసు కలెక్షన్లలో కూడ దూసుకుపోతుంది. మూడు రోజుల్లోనే 20 కోట్లు రాబట్టిన ఈ చిత్రం యొక్క శాటిలైట్స్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడు పోయాయి. బాలయ్య సినిమా కంటే ఒకటిన్నర కోట్ల రూపాయలకు అంటే 7.50 కోట్ల భారీ రేటు చెల్లించి, జెమినీ టీవీ సొంత చేసుకుంది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ కెరియర్లో ఈ సినిమానే హైయెస్ట్ రేటు పలికింది.

దర్శకుడు సురేందర్ రెడ్డి రొటీన్ స్టోరీతో తెరకెక్కినా అందులో పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు, కావాల్సినంత వినోదాన్ని జోడించడంతో సినిమాకు ఢోకా లేకుండా పోయింది. ఈ సినిమాను అల్లు అర్జున్, బ్రహ్మానందంలే తన భుజాల పై మోసారని చెప్పవచ్చు. చిత్రం చివర్లో బ్రహ్మీ కామెడీ హైలెట్ గా ఉండటంతో పాటు, థమన్ మ్యూజిక్, శ్రుతి హాసన్ అందాలు ప్రేక్షకులను కనుల విందు చేస్తున్నాయి. ఇటివల ఘనవిజయం సాదించిన ‘లెజెండ్ ’  శాటిలైట్ హక్కులను కూడా జెమినీ టీవీ నే సొంతం చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles