Mohan babu gets shock in supreme court

Mohan babu, tollywood actor mohan babu, padma shri award, supreem court

Mohan Babu Gets Shock in Supreme Court on Padma Shri Award.

మోహన్ బాబుకు సుప్రీం వార్నింగ్

Posted: 04/11/2014 06:28 PM IST
Mohan babu gets shock in supreme court

సినీ నటుడు మోహన్‌బాబుకి గతంలో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం ఇటీవలే వివాదాస్పదంగా వార్తలకెక్కింది. ఓ సినిమాలో ఆయన తన పేరుకు ముందు పద్మశ్రీని వినియోగించుకున్నారనీ, ఇది పద్మ పురస్కారాల నిబంధనలకు వ్యతిరేకమంటూ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

దాంతో అప్పట్లో హైకోర్టు, ఈ విషయంపై సీరియస్‌గానే స్పందించింది. పద్మ పురస్కారం పేరుని ఎక్కడా వాడుకోవద్దని హైకోర్టు తేల్చి చెప్పగా, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివాదం తర్వాత మోహన్ బాబు ఎక్కడా అలా ఉపయోగించడంలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అదే అంశాన్ని అఫిడవిట్ రూపంలో కూడా తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇక మీదట ఎక్కడా ఇంటి ముందు గానీ, సినిమాల్లో గానీ, నెంబరు ప్లేటు మీద గానీ వాడకూదని ఆదేశాలు జారీ చేస్తూ... కేసు విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles