Legend balakrishna makes halchal in movie theaters

Balakrishna, legend, legend movie release, legend balakrishna, balakrishna halchal in movie theaters, balakrishna fans, legend movie hit talk, Balakrishna celebrates with fans.

Legend Balakrishna Makes Halchal in movie Theaters

నందమూరి నటసింహం నగరంలో వీరంగం...

Posted: 03/28/2014 03:56 PM IST
Legend balakrishna makes halchal in movie theaters

నందమూరి నటసింహం  బాలకృష్ణ  ‘లెజెండ్ ’సినిమాతో  టాలీవుడ్ లో హడావుడి  చేస్తున్నారు.  నందమూరి అభిమానులకు  ఈరోజు  పండుగే.  ఈరోజు  బాలకృష్ణ  తమ అభిమానులతో  కలిసి  నగరంలో లెజెండ్  సినిమా విడుదల సందర్బంగా .. థియేటర్ల వద్ద హల్ చల్ చేశారు. 

ముఖ్యంగా కూకట్ పల్లి లో నందమూరి బాలకృష్ణ అలజడి చేశారు. ఆయన నటించిన 'లెజెండ్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇందులో భాగంగా కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్ లో అభిమానుల కోసం ప్రత్యేక షో ప్రదర్శించారు. 

ఈ షోను తిలకించడానికి బాలకృష్ణ కూకట్ పల్లి వచ్చారు. దీనితో థియేటర్ అంతా అభిమానులతో నిండిపోయింది. జై బాలయ్య..జై బాలయ్య..అంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణను చూడటానికి భారీగా జనం రావడంతో ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ తో స్తంభించిపోయింది. ఈసందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles