Shabbir ali attack on pawan kalyan personal life

pawan kalyan, shabbir ali, Shabbir Ali Attacks on pawan kalyan, Pawan Kalyan Jana Sena Launch, Jana Sena party, congress party, Shabbir Ali commented on Pawan Kalyan.

shabbir ali attack on pawan kalyan personal life

పవన్ కు పూర్తి గుండు గీయిస్తారట !

Posted: 03/20/2014 10:35 AM IST
Shabbir ali attack on pawan kalyan personal life

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పై కాంగ్రెస్ పార్టీ నేతలు మాటల దాడి చేస్తున్నారు.  అలాంటి వారిలో.. మొన్న వి.హనుమంతరావు, నిన్న  శంకరరావు,  పొన్నం ప్రభాకర్ , నేడు  షబ్బీర్ ఆలీ.  వీరు జనసేన పార్టీ  పరంగా విమర్శలు చేయటం లేదు.  గానీ పవన్ కళ్యాణ్ పర్సనల్  విషయాలపై కామెంట్ చేస్తున్నారు.   పవన్ కళ్యాణ్   తన వ్యక్తి గత విషయాలపై విమర్శలు చేయద్దని  రాజకీయ నాయకులకు సూచించిన విషయం తెలిసిందే.   

ఈరోజు  కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ  శ్రుతిమించి  పవన్ పై కామెంట్ చేయటం జరిగింది. జనసేన పేరుతో పార్టీ పెట్టి ..‘కాంగ్రెస్‌కు హఠావో-దేశ్‌కో బచావో’ అంటూ నినాదంతో ఇచ్చిన పవన్ పై కాంగ్రెస్  పార్టీ నేతలు రోజుకొకరు తీవ్ర స్థాయి లో విరుచుకు పడుతున్నారు.  

తాజాగా  తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు పరిటాల రవి సగం గుండు గీయించారని, తాను మాత్రం పూర్తి గుండు గీయిస్తానని హెచ్చరించారు.

కాంగ్రెస్‌కూ హటావో దేశ్‌కూ బచావో అనడం కాదు.. మొదలు నీ ఇంటిని సరిదిద్దుకో’’ అని ఎద్దేవా చేశారు. ఇంట్లో భార్యను కంట్రోల్ చేయనివాడు రాజకీయాలలో ఎలా అభివృద్ధి సాధిస్తాడో చెప్పాలంటూ ప్రశ్నించారు. 

గబ్బర్‌సింగ్ నువ్వా, నేనా తేల్చుకుందాం ..! అని ఓ సవాల్ కూడా చేశారు. అయితే షబ్బీర్ చేసిన హెచ్చకరికలకు, సవాళ్ళకు పవన్ పార్టీ కార్యాలయం ఇప్పటివరకు స్పందిచలేదు. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని పవన్ పార్టీ పెట్టిన రోజు నేతలకు విజ్ఞప్తి చేశారు. మరి షబ్బీర్ చేసిన ఈ వ్యాఖ్యలపై పవన్ ఎలాంటి పంచ్ వేస్తారో చూడాలి. ఈనెల 25 న విశాఖ లో పవన్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. బహుశా ఈ సభలో ఈ వ్యాఖ్యలపై పవన్ స్పందించవచ్చు.

ఆర్ఎస్  

   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles