Tamanna wrong action to pay the one thousand rupees

tamanna, Tamannaah Bhatia, Sajid Khan, Tamanna Rites, tamanna wrong action, one thousand rupees.

tamanna wrong action to pay the one thousand rupees

వెయ్యికి కక్కుర్తిపడి తప్పు చేసిన తమన్నా.

Posted: 03/20/2014 11:19 AM IST
Tamanna wrong action to pay the one thousand rupees

కేవలం పది వంద నోట్ల కోసం ..తమన్నా ఆ తప్పు చేసింది.  తమన్నా  కోట్లు సంపాదిస్తున్నప్పటికి  వెయ్యి రూపాయల కోసం  కుక్కుర్తిపడి ఆ పనిలోకి దిగింది.  తప్పు చేస్తే, డబ్బులిస్తానని తమన్నాతో పందెం కట్టారు బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్.  అసలే పడుసుపిల్ల ..యవ్వనం ఉరకలు వేసే వయసు. ఇలాంటి వయసులో  ఏ  పందెం కట్టిన  గెలిచి తీరాలనే పట్టుదల బాగా ఉంటుంది. అది తమన్నాలో పుష్కలంగా ఉంది. 

సైఫ్ అలీఖాన్, రితేష్ దేశ్‌ముఖ్, తమన్నా తదితరుల కాంబినేషన్‌లో ‘హమ్ షకల్స్’ అనే చిత్రం రూపొందుతోంది. సాజిద్‌ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇటీవల రితేష్, తమన్నాలపై ఓ సన్నివేశం తీశారు. అది క్లిష్టమైన సీన్ కావడంతో తమన్నా తడబడ్డారు.

దాంతో, సీన్‌ని మరోసారి విపులంగా వివరించి, ‘ఈసారి సరిగ్గా చెయ్యాలి’ అన్నారట సాజిద్. కానీ, ఆయనకు తెలియకుండా ‘నువ్వు కనుక ఈసారి కూడా తప్పుగా చేస్తే, నీకు వెయ్యి రూపాయలిస్తా’ అని రితేష్ అన్నారట. తమన్నాలో ఆశ పెరిగిపోయింది. ఊరికే వచ్చే డబ్బులను  ఎందుకు వదులుకోవాలని,  తమన్నా తప్పుగా చేసి తన పట్టుదల నిరూపించుకుంది.

దీంతో రితేష్ పది వంద నోట్లు లెక్కబెట్టి తమన్నా ఇవ్వటం జరిగింది. అయితే  ఇక్కడ ఎలాంటి ఘూరమైన తప్పు జరగలేదు.  కేవలం షూటింగ్ లో  ఫన్నీ కోసం ఇలాంటివి రితేష్  అప్పుడప్పుడు చేస్తాడని  చిత్రయూనిట్ సభ్యులు అంటున్నారు. తమన్నా ధైర్యానికి అందురు  మెచ్చుకున్నారు. 

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles