Pawan kalyan ism book release on march 25

Pawan Kalyan, Pawan, janasena, Pawan Kalyan Friend Raju Raviteja, Raju Raviteja, Pawan kalyan 'ISM' Book Release On March 25, March 25 pawan book release, ISM, Pawan ism Book details.

Pawan kalyan 'ISM' Book Release On March 25

ఈ నెల 25న పవన్ ‘ఇజం’ విడుదల?

Posted: 03/18/2014 01:37 PM IST
Pawan kalyan ism book release on march 25

పవర్ స్టార్  పవన్ కళ్యాన్   జనసేన పార్టీ  ఆవిర్బావ ప్రసంగంతో  ప్రతి సామాన్యుడు, ప్రతి రాజకీయా మేథావి, మేథావులు, పండితులు, నటులు, తదితరులను ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా పవన్  కళ్యాన్ ఆరు సంవత్సరాల నుండి   రాజకీయ బుక్ రాస్తున్నట్లు  రీసెంట్ గా బయటపడింది.  

 పవన్ కల్యాణ్ ని రచయితగా ఆవిష్కరించే 'ఇజం' (ISM) పుస్తకం విడుదలకు రెడీ అయింది. ఈ నెల 25న ఈ పుస్తకాన్ని మార్కెట్టుకి విడుదల  చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అంతేకాదు.. మొన్న అయిదు వేల మంది అభిమానులతో  పవన్ కళ్యాణ్  తన పార్టీని  లాంచ్ చేసిన విషయం తెలిసిందే.  ఈసారి మాత్రం అలా కాదట.   50 వేల మందితో  భారీ సభ ఏర్పాటు చేయటానికి  రెడీ అవుతున్నట్లు సమాచారం.  

అందుకు  విశాఖ,  విజయవాడ,  గుంటూరు ప్రాంతాలలో సభ నిర్వహించటానికి  పవన్ సైన్యం  రెఢీ అవుతుంది.  ఆ సభలోనే  'ఇజం' (ISM) పుస్తకం విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక ఆ  రోజు నుంచి ఈ బుక్ అన్ని పుస్తకాల షాపుల్లోనూ అందుబాటులో వుంటుంది. తన మిత్రుడు రాజు రవితేజ్ తో కలసి పవన్ గత కొంత కాలంగా ఈ పుస్తక రచనలో నిమగ్నమయ్యాడు. 

సమాజం పట్ల ... దేశ రాజకీయాల పట్ల... పవన్ అభిప్రాయాలను తెలియజేస్తూ, తాను నెలకొల్పిన 'జనసేన' పార్టీ మేనిఫెస్టోను ఈ పుస్తకం ఆవిష్కరిస్తుందని అంటున్నారు. మొదట్లో దీనిని ఆంగ్లంలో ప్రచురిస్తున్నప్పటికీ, త్వరలోనే తెలుగు ఎడిషన్ కూడా తీసుకువస్తారని సమాచారం. పవన్ కున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకం హాట్ కేక్ లా అమ్మకాలు జరుపుకుంటుందని భావిస్తున్నారు.

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles