Shriya saran special press meet in chennai

shriya saran, shriya, shriya saran special press meet in chennai, shriya movies, shriya latest movie news, shriya gossip news, shirya nagarjuna, manam movie.

shriya saran special press meet in chennai

ఎవరూ ముందుకురావటం లేదు ? నటి ఆవేదన?

Posted: 03/18/2014 10:52 AM IST
Shriya saran special press meet in chennai

సీనియర్ నటి శ్రియ తన ఆవేదన మీడియా ముందు వెల్లబోసుకుంది.  ఇప్పుడు  నా వయసు మూడు పదులు దాటింది కాబట్టి  నా ముఖం ఎవరు చూడటం లేదని  తన మనసులోని  ఆవేదన వ్యక్తం చేసింది.  టాలీవుడ్ , కోలీవుడ్  లో    25 ఏళ్లు దాటిన నటి ముఖం  చూడటానికి ఏ దర్శకుడు , ఏ హీరో, ఏ నిర్మాత ఇష్టపడారు.

అదే బాలీవుడ్ చిత్రసీమలో ముఫ్పైఏళ్లు దాటిన కథానాయికలకు కూడా మంచి ప్రాధాన్యతనిస్తారు.  ఆ వయసులోనే పూర్తి స్థాయి నటనను ప్రదర్శించగలుగుతారు. ఈ విషయంలో దక్షిణాది వారు బాలీవుడ్‌ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో వుంది అని అంటోంది శ్రియ. ఒకనాడు దక్షిణాది చిత్రసీమలో తిరుగులేని కథానాయికగా చెలామణి అయిన ఆమెకు ప్రస్తుతం అవకాశాలు కరువయ్యాయి.

ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం సినీపరిశ్రమలో గ్లామర్‌కే ప్రాధాన్యత పెరిగిపోయింది. అభినయంకన్నా అందం వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ ధోరణిలో మార్పు రావాలి. కాలక్రమంలో నటిగా నేను మంచి పరిణితి సాధించాను. 

ఈ సమయంలో ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలనన్న విశ్వాసమేర్పడింది. కానీ అవకాశలివ్వడానికి ఎవరూ ముందుకురావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది శ్రియ.  అయితే ఈ విషయాన్ని ముందే పసిగట్టిన టాలీవుడ్ మన్మథుడు   నాగార్జున  ‘మనం’ సినిమాలో  ఒక అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే  ప్రతిఒక్కరు శ్రియ మనసును అర్థం చేసుకుంటే  శ్రియ జీవితం  బాగుటుందని ఆమె అభిమానులు కోరుచున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles