Powerstar political speech script leaked

powerstar political speech leaked,pawan kalyan speech in political party, pawan kalyan political dialogues,pawan kalyan political party menu,pawan kalyan party script

Powerstar Political Speech Script Leaked, pawan kalyan speech in political party, pawan kalyan political dialogues

పవన్ స్పీచ్ లో ముఖ్యాంశాలు...

Posted: 03/11/2014 03:39 PM IST
Powerstar political speech script leaked

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈనెల 14 తేదీన హైటెక్స్ లో కొత్త రాజకీయ పార్టీని ప్రకటన చేయబోతున్న విషయం తెలిసిందే. త్వరలో జరగబోయే ఎన్నికల ముందు ప్రకటించబోతున్న ఈ పార్టీ పై ఇటు రాజకీయ వర్గాల్లో, అటు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తాను స్థాపించబోయే పార్టీ గురించి, ఆ పార్టీ లక్ష్యాల గురించి, తాను రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటో తెలియజేసే ప్రసంగం కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇంత ఆసక్తి పెరిగి పోవడానికి కూడా ఓ కారణం ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నీ తానై రాస్తున్న ఈ స్క్రిప్టు లో ఎలాంటి పంచ్ డైలాగులు ఉండబోతున్నాయో అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఈ ప్రెస్ మీట్ ప్రసంగం ముందే లీకయ్యింది. దాదాపు ఈ ప్రెస్ మీట్ కోసం 45 నిమిషాల స్ర్కిప్ట్ రెడీ అయ్యిందని ఇందులో అనేక రాజకీయ, సామాజిక విషయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల నుండి అంతర్జాతీయ రాజకీయాల పై కూడా మాట్లాడబోతున్నాడని అంటున్నారు.

ఫిలిం వర్గాల నుండి లీకైన సమాచారాన్ని బట్టి పవన్ స్పీచ్ లో ముఖ్యాంశాలు...

- తాను రాజకీయాల్లోకి వచ్చేది అధికారం కోసం కాదని... సమకాలీన రాజకీయ వ్యవస్థను మార్చడానికే అని, అన్యాయాన్ని ఎదిరించండి... న్యాయాన్ని గెలిపించండి అనే నినాదంతో తెలుగు ప్రజల్లో వెలుగు నింపే ప్రయత్నం చేయడం.

- గతంలో రాజకీయాల్లోకి వచ్చినా... కొన్ని పొరపాట్లు చేశాను. ఈసారి అలాంటివి జరగకుండా చూసుకుంటానని ప్రజలకు తెలియజెప్పడం. రాజకీయ పార్టీ అంటే టి.20 మ్యాచ్ లాంటిది కాదని, ఫలితం రావాలంటే కొన్నేళ్లు వేచి చూడాలని, పార్టీలు పెట్టి పదవులు కోరుకోవడం తప్పని చెప్పడం.

- బడా రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉండి కొన్ని వేల కోట్లు సంపాదించారు. అలాంటి వారు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడాలి. అవినీతి రాజకీయ నాయకుల చిట్టా విప్పి ప్రజల ముందు ఉంచుతానని చెప్పడం.
యువత, మహిళల సమస్యలు, విద్య, ఆరోగ్యం, మహిళల పురోభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రసంగం చేయడమే కాకుండా పలు అంశాల పై వారికి అవగాహన కలింగించే ఈ స్పీచ్ ఉంటుందని అంటున్నారు.

- ఈ స్పీచ్ అనంతరం పవన్ రాజకీయాల పై రాసిన బుక్ ని విడుదల చేస్తారని, అప్పుడే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలను, అభ్యర్థుల్ని కూడా ప్రకటిస్తారని అంటున్నారు. ఏది ఏమైనా ఇటు రాజకీయ , సినీ వర్గాల వారు పవన్ స్పీచ్ పై ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles