Jr ntr to replace mahesh babu in rudramadevi

mahesh babu,jr ntr,anushka,rudramadevi,gunasekhar,rudramadevi 3d,rudrama devi,ravi teja,ilayaraja

Now buzz is that actor Jr NTR might take up the role of the warrior in Rudhramadevi.

బుడ్డోడు గోన గన్నారెడ్డిగా వస్తున్నాడు

Posted: 03/11/2014 01:16 PM IST
Jr ntr to replace mahesh babu in rudramadevi

ఇటీవలి కాలంలో టాలీవుడ్ లోని స్టార్ హీరోలు ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేయడం మామాలు అయిపోయింది. దీంతో సెట్స్ పై ఉన్న ప్రతి సినిమాల పై ఏదో ఒక రూమర్ ఫిలింనగర్లో సంచరిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా గుణశేఖర్ దర్శత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘రుద్రమదేవి ’ సినిమా పై కూడా రోజుకో రూమర్ పుట్టుకొస్తుంది.

ఈ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో ఓ స్టార్ హీరోను పెట్టాలని చూస్తున్నాడు దర్శకుడు. మొదట మహేష్ బాబుతో చేయించాలని చూసినా దానికి ఆయన ఒప్పుకోకపోవడంతో ఆ పాత్రలో రవితేజను తీసుకున్నాడనే వార్తలు వచ్చాయి. అవికూడా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఆ పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకున్నాడని వార్తలు బయలు దేరాయి.

ఈ పాత్రలో నటించడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, వచ్చే నెలలో డేట్స్ కూడా ఇచ్చాడని, ఇతని పై సన్నివేశాలను ఏప్రిల్ నుండి షూట్ చేస్తారని కూడా ప్రచారం చేస్తున్నారు. ఒక వేళ అది నిజం అయితే సినిమాకు మరింత హైప్ రావడం ఖాయం. ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles