Pawan remuneration 10 crores for 15 minutes

pawan kalyan remuneration 10 Cr, pawan kalyan in oh my god, pawan kalyan remuneration in o my god movie, Oh My God Telugu remake, Pawan in Lord Krishna role

Pawan Kalyan could really shock anyone. An offer of 10 crores for just 15 minutes cameo and that is what is Pawan's stamina, if one can say.

పవన్ రేంజ్ అంటే ఇది ...

Posted: 02/15/2014 12:56 PM IST
Pawan remuneration 10 crores for 15 minutes

హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ‘గబ్బర్ సింగ్ ’, ‘అత్తారింటికి దారేది ’ సినిమాలతో తన స్టార్ డమ్ పీక్ స్టేజ్ కి వెళ్లడమే కాకుండా పారితోషికం కూడా చాలా హైలోకి వెళ్లింది. తన సినిమా కోసం పారితోషికం తీసుకోకుండా వచ్చిన షేర్ లో పర్సంటేజ్ తీసుకునే పవన్ ఇప్పుడు ఓ సినిమాలో చిన్న పాత్ర కోసం మాత్రం అక్షరాల పదికోట్లు తీసుకుంటున్నారు.

కేవలం 10 నుండి 15 నిమిషాలు మాత్రమే ఉండే ఈ పాత్రకు అంత ఇవ్వడానికి కూడా నిర్మాతలు ఏ మాత్రం వెనకాడటం లేదని అంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో హిందీ చిత్రం ‘ఓ మై గాడ్ ’ రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా లో పవన్ హిందీలో అక్షయ్ కుమార్ పోషించిన ‘క్రుష్ణుడి ’ పాత్ర పోషించబోతున్నాడు. ఇందుకోసం పవన్ 10 కోట్లు అందుకోబోతున్నాడట. ఇక పరేష్ రావల్ పోషించిన పాత్రలో వెంకటేష్ నటించబోతున్నాడు.

ఇక్కడ విశేషం ఏంటంటే... పవన్ చేయబోయే ‘గబ్బర్ సింగ్ -2 ’ చిత్రానికి ముందే ఈ సినిమా వస్తుందట. ‘అత్తారింటికి దారేది ’ తరువాత ఎలాంటి ప్రాజెక్టు మొదలు పెట్టని పవన్ త్వరలో ఈ సినిమా షూటింగు పూర్తి చేసే తరువాత తన సొంత ప్రాజెక్టుల్లో బిజీ అయిపోతాడని అంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పవన్ స్నేహితుడు శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహించబోతున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles