Mega hero varun tej film launch on feb 27th

Mega hero, Varun Tej film launch date, Varuntej movie lunch date confirmed, hero varuntej , varuntej latest movie, srikanth addala, pooja hegde heroine

Mega Brother Naga Babu’s son Varun Tej is making his debut in the Telugu Film Industry. This movie camera on Feb 27th.

వరుణ్ తేజ్ సినిమాకి మోక్షం కలిగింది

Posted: 01/29/2014 09:50 AM IST
Mega hero varun tej film launch on feb 27th

మెగా ఫ్యామిలీ నుండి మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఎట్టేకేలకు డేట్ ఫిక్స్ అయ్యింది.  గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఓపెనింగ్ వచ్చేనెల 27 తారీకున అన్నపూర్ణ స్టూడియోస్ లో మెగా హీరోల సమక్షంలో జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి చింరజీవి వచ్చి క్లాప్ కొడతాడని, అల్లు అరవింద్ కెమెరా స్విట్ ఆన్ చేస్తారని, తొలి షాట్ కి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. వీరే కాకుండా పలువురు చిత్ర ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేయనున్నారు.

ప్రముఖ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా ‘గొల్లబామ ’ ఫిక్స్ చేశారు. ఇందులో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్దే ఎంపిక చేశారు. ఇందులో కన్నడ భామ అక్షర గౌడ నటిస్తుందంటూ వార్తలు వచ్చినా చివరికి పూజానే ఖరారు చేశారు. గోదావరి నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథగా రూపొందే ఈ చిత్రాన్ని ఠాగూరు మధు, నల్లమల్లపు బుజ్జి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ కావడంతో మెగా అభిమానుల్లో ఉన్న ఉత్కంఠకు తెర పడింది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles