Heart attack moive pre release business 20 crores

Nitin Heart Attack, Pre-release business, 20 crores, Rocking collections, Nizam area rights, Puri Jaganath

Heart Attack movie Before the release of the flick itself its creating and breaking records, it has collected Rs.20 crores.

బిజినెస్ చూస్తే ‘హార్ట్ ఎటాక్ ’ వస్తోంది

Posted: 01/27/2014 03:08 PM IST
Heart attack moive pre release business 20 crores

వరుసగా రెండు హిట్ చిత్రాలతో మళ్ళీ ఫాంలోకి వచ్చిన యంగ్ హీరో ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హార్ట్ ఎటాక్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఈనెల 31 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నారు. త్వరలో సెన్సార్ కి వెళ్లనున్న ఈ సినిమా భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకుందని తెలుస్తుంది.

దాదాపు 23 కోట్ల రూపాలయ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈసినిమా ఇప్పటికే 20 కోట్ల రూపాయలకు రాబట్టకున్నందని అంటున్నారు. నైజాంలో ఈ చిత్రం హక్కుల్ని 6 కోట్లకి, సీడెడ్‌లో 2 కోట్లకి, ఆంధ్రాలో 8 కోట్లకు అమ్మారని తెలుస్తోంది. శాటిలైట్ హక్కుల్ని జెమినీ టెలివిజన్ వారు 4 కోట్లు పెట్టి కొన్నట్లు చెబుతున్నారు. ఓవర్సీస్ ఎంతకు పోయిందో తెలియాల్సి ఉంది.

అది కూడా మంచి రేటు పలికితే సినిమా పెట్టిన పెట్టుబడి వచ్చేసినట్లేనని, సినిమా విడుదల అయ్యి కాస్తంత పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే నిర్మాతలకు లాభాల పంట పండినట్లే అంటున్నారు. ఈ సినినిమా ఇంత బిజినెస్ చేయడానికి నితిన్ గత రెండు సినిమాల కలెక్షన్లు, పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించడమే కారణం అంటున్నారు. నితిన్ సరసన మొదటి సారిగా అదా శర్మ నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ‘హ్రుదయాల్ని ’ దోచుకుంటుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles