Varma comments on manam movie

ANR, Nagarjuna, Nagachaitanya, acting together in this movie, Ram Gopal varma about Manam movie, Akkineni Multistarrer movie manam, RGV about Manam movie, RGV Twitter

MANAM is the most original feel of a film I have seen since a very long time and Vikram is the most promising director I ever met in years.

‘మనం ’ సినిమా పై వర్మ కామెంట్లు

Posted: 01/27/2014 06:01 PM IST
Varma comments on manam movie

రామ్ గోపాల్ వర్మ... సినిమా ఇండస్ట్రీలో వివాదస్పద వ్యాఖ్యలకు బ్రాండ్ అంబాసిడర్. తన మదికి ఏ ఆలోచన వచ్చినా ముందు వెనకా ఆలోచించకుండా కామెంట్లు పోస్టు చేస్తాడు. వీటిల్లో అన్నీ కాంట్రవర్షియల్ గానే ఉంటాయి. ఎప్పుడు ఇతరుల పై కామెంట్లు చేసే వర్మ ఈ సారి మాత్రం పలువురితో విమర్శలు ఎదుర్కొన్నాడు.

కారణం ఆయనకు సినిమా లైఫ్ ని ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత , ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వర రావు చనిపోతే కనీసం కడసారి కూడా చూడటానికి వెళ్ళలేదు. ఈ విమర్శలన్నింటిని మౌనంగా భరించిన ఆయన వాటిని కవర్ చేసుకునే పనిలో పడ్డాడు.

ఆయన ఉన్నట్లుండి అక్కినేని త్రయం నటించిన ‘మనం ’ సినిమా గురించి కొన్ని ట్వీట్ చేస్తూ... ‘మనం ’ సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా అద్బుతంగా ఉన్నాయని, ఆ సినిమాకు దర్శకత్వం వహించిన విక్రమ్ కె. కుమార్ చాలా బాగా తెరకెక్కించాడని, అందులో అక్కినేని నటన మరచిపోనిదిగా మిగిలి పోతుందని రాశాడు. అయినా అక్కినేని పోయినప్పుడు ఏమీ మాట్లాడని వర్మ ఇప్పుడిలా ఎందుకు ట్వీట్ చేసినట్లో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles