Director sampath nandi turns producer

pawan kalyan, sampath nandi, gabbar singh 2, aadi,, Gabbar Singh-2 director, sampath nandi team works,

Director Sampath Nandi has now turned into producer, he is going to make new movie with actor Sai Kumar son Aadi as a lead actor.

గబ్బర్ సింగ్ -2 దర్శకుడు నిర్మాతగా

Posted: 01/18/2014 10:56 AM IST
Director sampath nandi turns producer

చోటా బడా దర్శకులందరు నిర్మాతలుగా మారుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు సొంత నిర్మాణ సంస్థలు నెలకొల్పి చిన్న చిత్రాలను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇప్పుడు వారి జాబితాలోకి ‘రచ్చ’ ఫేం సంపత్ నంది కూడా వచ్చి చేరాడు. ఇప్పటికీ టాలీవుడ్ లో ఈయన దర్శకత్వం వహించింది రెండు సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఏకంగా పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2 ’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్న ఈయన త్వరలో సంపత్ నంది టీం వర్క్స్ పేరుతో ఓ బ్యానర్ ని నెలకొల్పి సినిమాలు నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

తన బ్యానర్ లో మొదటి సినిమాగా సాయికుమార్ తనయుడు ఆది హీరోగా నవీన్ గాంధీ ని దర్శకుడిగా ఓ సినిమాను కూడా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఈయన దర్శకత్వం వహించబోయే సినిమా సంగతి పక్కన పెట్టి సొంత ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడంటే ‘గబ్బర్ సింగ్ 2’ సినిమా నుండి ఈయన్ను ప్రక్కన పెట్టారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles