Sanjjanaa complaint against a family friend

Tollywood actress Sanjjanaa, Rajiv Malhotra, Prashanth

Tollywood actress Sanjjanaa is on the verge of filing a police complaint against a family friend following the latter’s refusal to repay a loan of Rs 13.5 lakh that he had taken from the actress two years ago.

సంజనా ను చంపేస్తామంటున్నారు

Posted: 01/18/2014 05:44 PM IST
Sanjjanaa complaint against a family friend

తెలుగు, కన్నడ ప్రేక్షకులకు పరిచయం ఉన్న కన్నడ బ్యూటీ సంజన తనకు ప్రాణం భయం ఉందంటూ బెంగుళూరు పోలీసులను ఆశ్రయించింది. ఈమెను చంపుతామని బెదిరింపులు రావడంతో బెంబేలెత్తిన ఈ అమ్మడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను తమ కుటుంబ స్నేహితుడు అయిన రాజీవ్ మల్హోత్రా కొడుకు ప్రసాద్ బెదిరించాడని, 2012లో తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేయాలని అడిగినందుకే తన పై బెదిరింపులకు పాల్పడుతున్నాడని తన వాగ్మూలంలో పేర్కొంది.

ప్రసాద్ 2012లో తన వద్ద రూ.13.5 లక్షలు అప్పుగా తీసుకున్నారని, ఆ డబ్బును తిరిగి చెల్లించమని కోరగా మొదట కొంచెం సమయం అడిగారని, మరోసారి డబ్బు అడగగా చెక్కు ఇచ్చారని తెలిపింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందాని చెబితే ఇలా బెదిరింపులు చేశారని తనకు వారి నుండి రక్షణ కల్పించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles