One yevadu piracy cds in vijayawada

Nenokkadine and Yevadu Piracy CD Out, Piracy Mafia Releases Yevadu, One Movie Piracy CDs in Vijayawada, Yevadu movie piracy

Nenokkadine and Yevadu Piracy CD Out, Piracy Mafia Releases Yevadu, One Movie Piracy CDs in Vijayawada, Yevadu movie piracy

మార్కెట్లో కుప్పలు తెప్పలుగా పైరసీ

Posted: 01/13/2014 04:08 PM IST
One yevadu piracy cds in vijayawada

సినీమా ఇండస్ట్రీని పైరసీ చీడ పురుగు పట్టినట్లు పట్టి పీడిస్తుంది. ఏభాష సినిమా అయినా సరే విడుదల అయిన రోజే పైరసీకి గురవుతుంది. తాజాగా టాలీవుడ్ లో విడుదల అయిన బడా హీరోల సినిమాలు అయిన మహేష్ బాబు ‘1’ నేనొక్కడినే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు ’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయిన విషయం తెలిసిందే. విడుదల అయ్యి 48 గంటలు గడవక ముందే ఈ రెండు సినిమాల పైరసీ సీడీలు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

ఈ సీడీలు విజయవాడ, క్రిష్ణా జిల్లాలోని చుట్టు ప్రక్కల విచ్చల విడిగా దొరుకుతున్నట్లు సమాచారం అందడంతో చిత్ర యూనిట్ ఒక్కసారి ఉలిక్కి పడింది. ఈ రెండు సినిమాల పైరసీ సీడిలను మార్కెట్ లోకి పెద్ద మొత్తంలో విడుదల చేసేందుకు పైరసీ ముఠా సిద్దం అయినట్లు పోలీసులకు సమాచారం అయింది. దీంతో వారు అలర్ట్ అయ్యారు.

అయితే ఆ జిల్లాలో పైరసీ సీడీలను ఓ వ్యక్తి సినిమా ఇండస్ట్రీలోని పెద్దల సహకారంతోనే చేస్తున్నాడని సమాచారం. ఈ విషయం పై ఈ రెండు సినిమాల నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘అత్తారింటికి దారేది ’ సినిమా తరువాత పైరసీ పై చర్యలు చేపడతామని చెప్పిన అవి గాలి మాటలే అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles