Hero mother warning to nayantara

kollywood hero Arya, Arya mother Warning to Nayantara, Hero Arya mother Warning to Nayantara, Arya and Nayanthara

Arya mother has said there is nothing wrong in the couple being close but has apparently warned Nayanthara.

నయనతారకు వార్నింగ్ పడింది ?

Posted: 01/09/2014 03:03 PM IST
Hero mother warning to nayantara

ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎఫైర్లు నడిపితే కెరియర్ కి పుల్ స్టాప్ పడుతుందని భయపడి సీక్రెట్ గా యవ్వారం నడుపుతుంటారు. మరి కొందరు బహిరంగంగానే నడుపుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి వారిలో నయనతార ఒకరు. ఈ అమ్మడు ఇప్పటి వరకు ముగ్గురితో ప్రేమాయణాలు నడిపింది.

మొదటి లవర్ శింబుతో విడిపోయిన తరువాత ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమలో మునిగి, ఆయన సంసారంలో నిప్పులు పోసి, పెళ్ళి కూడా చేసుకోవడానికి రెఢీ అయ్యింది. కానీ చివరి నిమిషంలో పెళ్లి పెటాకులు కావడంతో ఖాళీగా ఉండలేక కోలీవుడ్ కోస్టార్ అయిన ఆర్యాతో ప్రేమాయణం మొదలు పెట్టి, ఆయనతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతుంది.

నయన్ - ఆర్యా జంటగా నటించిన ‘రాజారాణి ’ సినిమా తరువాత వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే ప్రచారం జరిగింది. ఈ వ్యవహారం అంతా గమనిస్తున్న ఆర్యా తల్లి నయన తారను ఇటీవల ఇంటికి ఆహ్వానించి తిట్టి మరీ పంపించిందట. తన కొడుకుతో కలిసి సినిమాల్లో నటిస్తే పర్వాలేదనీ, అంతకు మించి సన్నిహితంగా ప్రవర్తిస్తే మాత్రం మర్యాద వుండదనీ ఆమె హెచ్చరించిందని చెబుతున్నారు కోలీవుడ్ జనాలు. 

దీంతో నయన్ బాగా అప్సెట్ అవ్వడంతో విషయం తెలుసుకున్న ఆర్యా తన వైపు నుండి తల్లి తరుపున సారీ చెప్పాడని అంటున్నారు.  ఎందరితో ప్రేమాయణాలు నడిపినా అవకాశాలు ఏ మాత్రం తగ్గకుండా అన్నీ విజయాలే వస్తున్నా, ప్రేమ పరీక్షలో మాత్రం ఈమెకు విజయాలు వరించడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles