Life of pi actress shravanthi secret marriage

Life of Pi actress Shravanthi, Shravanthi Sainath, Sameer Bharat Ram, Life Of Pi movie, private ceremony, Shravanthi secret marriage

Life of Pi actress Shravanthi Sainath recently married Chennai based Entrepreneur Sameer Bharat Ram.

లైఫ్ ఆఫ్ పై హీరోయిన్ లైఫ్ పాట్నర్ ని వెతుక్కుంది

Posted: 01/08/2014 11:43 AM IST
Life of pi actress shravanthi secret marriage

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత మంది హీరోయిన్లు చేసిన ఒకటి రెండు సినిమాలతో మంచి పేరు, అస్కార్ అవార్డలు అందుకున్న వారు ఉన్నారు. ఆస్కార్ అవార్డు అంటే మామూలు విషయం కాదు. ఈ అవార్డుతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోతారు. అలా తెరపైకి వచ్చిందే చెన్నై సుందరి శర్వంతి.

ఈ అమ్మడు ఆ మధ్యన వచ్చిన ఆంగ్ల చిత్రం ‘లైఫ్ ఆఫ్ పై ’ లో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా తరువాత నుండి తెలుగు, హిందీ, తమిళ భాషల తెర పై కనిపించని ఈ అమ్మడు ప్రముఖ వ్యాపార వేత్త అయిన సమీర్ భరత్‌రామ్‌ ను సీక్రెట్ గా పెళ్ళాడిందని సమాచారం. లైఫ్ ఆఫ్ పై తరువాత తన లైఫే మారిపోయిన ఈ అమ్మడు అప్పటి నుండి అతనితో పీకల్లోతు ప్రేమలో మునిగిందని, కొంత కాలం డేటింగ్ చేసిన తరువాత ఇటీవలనే అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య నిడారంబరంగా పెళ్లి చేసుకుందని అంటున్నారు.

ఇంత వరకు బాగానే ఉన్నా పెళ్లి తరువాత ఈ అమ్మడు చాలా సమస్యలు ఎదుర్కొంటుందని సమాచారం. తన తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నందున వారు ఈమె పై కోపంగా ఉన్నారట. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కునే ఈమె అప్పుడే ఎందుకు తొందర పడిందో మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles