Mahesh aagadu film next in gujarat

Mahesh Babu, Aagadu film next schedul Gujarat, Super Star Mahesh

Mahesh Babu Aagadu film next schedule will commence on 18th January in Gujarat. A schedule

గుజరాత్ లో మహేష్ బాబు

Posted: 01/04/2014 09:41 PM IST
Mahesh aagadu film next in gujarat

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గడ్డ పై అడుగు పెట్టబోతున్నాడు. మోడీ మేనియాతో ఏపీని వదిలి వచ్చే ఎన్నికల్లో గుజరాత్ లో పోటీ చేయడానికి మాత్రం కాదు లెండి. ప్రస్తుతం ఈయన శీను వైట్ల దర్శకత్వంలో ‘ఆగడు ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా చిత్రీకరణకు సబంధించి సెకండ్ షెడ్యూలును అక్కడ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూలు ఈ నెల 18 నుంచి జరుగుతుంది. ఈ లోకేషన్ల ఎంపిక కోసం దర్శకుడు శీనువైట్ల, కెమెరామెన్ గుహన్ కలిసి అక్కడ ప్రదేశాలను ఎంపిక చేయడానికి వెళ్లాడు. మహేష్ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఇటీవలే రామోజీ పిలిం సిటీలో జరిగిన షూటింగులో కామెడీ సీన్లు చిత్రీకరించారు. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కు థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోసారి మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఇందులో తమన్నా కథానాయికగా తొలిసారి నటిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles