Arjun rampal says not involved hrithik sussanne split

arjun Rampal, Hrithik Roshan split, Sussanne Roshan, Hrithik-Sussanne split, Arjun Rampal not involved

As the reports about Hrithik and Sussanne divorce hit the headlines, rumours about Arjun Rampal proximity with Sussanne was sought as one of the reasons for the star couples separation.

నేను వాళ్ళ సంసారంలో నిప్పులు పోయలేదు

Posted: 12/17/2013 10:54 AM IST
Arjun rampal says not involved hrithik sussanne split

బాలీవుడ్ అగ్ర నటుడు హృతిక్ రోషన్, అతని భార్య సుజానె విడిపోతున్నట్లు గత మూడు నాలుగు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. పదమూడేళ్ళ వీరి వివాహా బంధం ఇప్పుడు బ్రేక్ కావడం వెనక  అనేక కారణాలు వినిపించాయి. అందులో ఒకటి బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కారణంగానే వీరు విడిపోయారనే వాదన బలంగా వినిపించింది. హృతిక్ రోషన్, అర్జున్ రాంపాల్ మంచి స్నేహితులు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. అయితే ఇటీవలి కాలంలో అర్జున్ రాంపాల్ సుజానేతో ఎక్కువగా కనిపిస్తుండం, చనువుగా కనిపిస్తుండటంతో అతనే కారణం అని అనుకున్నారు.

దీని పై ఇన్ని రోజులు మౌనంగా ఉన్న అర్జున్ రాంపాల్ స్పందిస్తూ... కాపురాలు కూల్చాల్సిన అవసరం నాకు లేదని, ఆ వార్తలు విని నేనే షాకయ్యాను. అలాంటి అవసరం నాకేముందని, అవన్నీ నిరాధారమైన వార్తలు అని అర్జున్ రామ్ పాల్ చెప్పాడు. దీంతో హృతిక్ రోషన్, సుజానేలు విడిపోవడానికి కారణం అక్రమ సంబంధమనే కారణం అనే వార్తలు వినిపిస్తున్నాయి. నటి బార్బరా మోరీతో హృతిక్ సన్నిహితంగా మెలగడం సుజానెకు నచ్చలేదని అందుకే సుజానే హృతిక్ నుండి విడిపోవడానికి సిద్ద పడిందని అంటున్నారు.

ఇప్పుడు సుజానె తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఆమె ఇద్దరు కుమారులు హ్రెహాన్, హృదాన తండ్రి హృతిక్ రోషన్‌తో కలిసి ఉంటున్నారు. ఇద్దరు పిల్లలను తమ తల్లిని గ్రాండ్ ఫాందర్ ఇంటికి వెళ్లి కలుస్తున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles