Pawan kalyan pair up with rakul preet singh

gabbar singh-2 heroine, Pawan Kalyan, Gabbar Singh 2 Heroines, Rakul Preet Singh, Gabbar singh 2 heroine, Gabbar singh 2 actress, Gabbar singh 2 latest news

Rakul Preet is lucky to pair up opposite to Pawan Kalyan gabbar singh-2 movie.

‘ఎక్స్ ప్రెస్ ’ భామతో పవన్ రొమాన్స్

Posted: 12/17/2013 04:03 PM IST
Pawan kalyan pair up with rakul preet singh

ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ అమ్మడికి లక్కీ ఛాన్స్ తగులుతుందో చెప్పలేం. ఒకటి రెండు సినిమాలు చేసి పెద్దగా నేమ్ ఫేము సంపాదించుకోకున్నా పెద్ద స్టార్ల సరసన చేసే అవకాశం దక్కుతుంది. ఇప్పుడు అలాంటి లక్కీ ఛాన్సే వచ్చింది రాకుల్ ప్రీత్ సింగ్ కి. ఇటీవలే ఈ అమ్మడు నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ’ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించబోయే ‘గబ్బర్ సింగ్ -2’ చిత్రంలో ఈ అమ్మడిని పవన్ సరసన ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇప్పటికే చాలా మంది భామల పేర్లు పరిశీలించినా ఎవరూ సెలక్ట్ కాకపోవడంతో చివరికి ఈ అమ్మడిని ఫైనల్ చేశారని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన దర్శక, నిర్మాతలు కూడా ఈమె వైపే మొగ్గు చూపుతున్నారట. పవన్ పక్కన నటిస్తే తమ రేంజ్ పెరుగుతుందని కథానాయికలు ఆశగా ఎదురుచూస్తుంటారు. అలాంటిది ఊహించకుండానే రకుల్ కి ఈ అవకాశం వచ్చినందుకు ఆమె లక్కీ అనే చెప్పాలి. ఇంత వరకు బాగానే ఉన్నా పవన్ కళ్యాణ్ ఈ అమ్మడికి ఛాన్స్ ఇస్తాడా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles