Telugu actor raja ravindra caught for drunken driving

Telugu actor Raja Ravindra caught for drunken driving. Raja ravindra, Drunk and Drive case, Banjarahills Police, Hyderabad

Telugu actor Raja Ravindra caught for drunken driving. Raja ravindra, Drunk and Drive case, Banjarahills Police, Hyderabad

రాజా రవీంద్ర అడ్డంగా బుక్కయ్యాడు

Posted: 11/18/2013 11:47 AM IST
Telugu actor raja ravindra caught for drunken driving

సినిమా రంగానికి చెందిన హీరోలు, బడా బాబుల కొడుకులు వీకెండ్ వచ్చిందంటే చాలు ఫుల్లుగా మద్యం  సేవించి కాస్లీ కార్లలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రోడ్ల పై రయ్యిమంటూ దూసుకుపోవడం వీరికి ఓ సరదా. గతంలో చాలా మంది హీరోలు ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికికారు కూడా.

పోలీసులు ఎంత చెప్పినా వీరి వైఖరిలో మాత్రం మార్పులేదు. ఇప్పుడు మరో నటుడు కూడా ఫుల్లుగా మద్యం సేవించి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. సీనియర్ నటుడు అయిన రాజా రవీంద్ర  ఫిలింనగర్ నుంచి బంజారాహిల్స్ వైపు నలుపు రంగు స్కోడా కారులో (ఏపీ 20ఏపీ 1111) దూసుకుపోతుంటే పోలీసులు పట్టుకున్నారు.

దానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ... రవి  రాజా మోతాదుకు మించి మద్యం సేవించాడని, అనుమతించిన దానికంటే ఆల్కహాల్ శాతం అధికంగా ఉండడం వల్లే అతడిపై కేసు నమోదు చేశామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. పోలీసులు ఆయన కారును స్వాధీనం చేసుకుని, ఆయనపై కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles